Advertisement
Google Ads BL

ఆ నిర్మాతల ప్లాన్ ఏంటి..!!


 

Advertisement
CJ Advs

గత కొన్నేళ్లగా సినిమాకు బడ్జెట్‌ పెరిగిపోతుందని, పారితోషికాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయనీ, నియంత్రించడం కష్టమవుతుందని నిర్మాతలు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. హీరో నుంచి ప్రొడక్షన్‌ బాయ్‌ వరకు ప్రతి ఒక్కరికీ కూలి(రెమ్యూనరేషన్‌)ముట్ట చెప్పాల్సింది నిర్మాతే. బడ్జెట్‌ కంట్రోల్‌ చెయ్యడానికి ఎన్నో మార్గాలున్నాయి. పారితోషికాలు తగ్గించుకోవడం, వర్కింగ్‌ డేస్‌ తగ్గించుకోవడం వంటి మార్టాలున్నాయి. అయితే వీటిని కంట్రోల్‌ చేయలేని నిర్మాతలు ఇప్పుడు కొత్త పంధాలో ముందుపోయే సన్నాహాల్లో ఉన్నారు. సినిమా ప్రమోషన్‌కి కోట్లు వెచ్చిస్తున్నామనీ, బడ్జెట్‌తోపాటు ఇది కూడా పెద్ద భారంగా మారిపోతుందని వాపోతున్నారు నేటి బడా నిర్మాతలు. అయితే తాజాగా పలువురు బడా నిర్మాతలు కలిసి నిర్మాతల మండలిలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఓ నిర్ణయానికొచ్చారని సమాచారం. 

అదేంటంటే సినిమా ప్రమోషన్‌ రెండు, మూడు న్యూస్‌ ఛానల్స్‌తోపాటు, కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌ ద్వారానే చెయ్యాలని వారి నిర్ణయమట. వారు నిర్ణయించుకున్న ఛానల్స్‌లో మాత్రమే సినిమా ప్రమోషన్‌ చేస్తారట. ఇతర ఛానల్స్‌తో వారికి పని లేదట. అందుకు కారణం కూడా చెబుతున్నారు. న్యూస్‌ ఛానల్స్‌ చూసే ప్రేక్షకులే లేరట. ‘ఆడవాళ్ళు టీవీ సీరియల్స్‌కే అతుక్కుపోతున్నారు. న్యూస్‌ ఛానల్స్‌ కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌కి ప్రమోషన్స్‌ కోసం చిత్ర యూనిట్‌ వెళ్తే సినిమా జనాల్లోకి వెళ్తుందని’ ఈ నిర్మాతల నమ్మకమట. 

ఈ రాద్ధాంతం బయటికి రావడానికి మరో ముఖ్య కారణం ఉంది. ఇటీవల ఓ సినిమా ప్రమోషన్‌కి కోటి రూపాయిలు ఖర్చు కావడం అందుకు కారణమట. ఓ ప్రముఖ ఛానల్‌ అడ్వర్టైజ్‌మెంట్స్‌ విషయంలో మోసం చేసిందట. అందుకే కొందరు నిర్మాతలు ఒకే దగ్గర భేటి అయ్యి ఓ నిర్ణయానికి వచ్చారు. సెలెక్టెడ్‌ మీడియాకే ఆయా సినిమా ప్రమోషన్‌ బాధ్యతలు అప్పగిస్తారట. ఇందుకు సంబంధించిన చర్చలు ఆయా ఛానళ్ళతో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ పనులు పూర్తికాగానే రానున్న మూడు నెలల్లో నిర్మాతలు, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో ఎంపిక చేసుకున్న ఛానల్స్‌కే యాడ్స్‌ ఇచ్చి, ఆ సంస్థలకే ఆయా సినిమా నటీనటుల ఇంటర్వ్యూలు ఇచ్చేలా ఓ ప్రణాళిక సిద్ధం చేయనున్నారట. ఈ విధంగా ప్రమోషన్‌ వ్యయం తగ్గించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. 

రానున్న ఏడాదిలో నటీనటులు, సాంకేతిక నిపుణులు పారితోషికాన్ని కూడా తగ్గిస్తారట. ఇది ఎంత వరకు అమలు చేస్తారో చూడాలి. ఇన్ని ఏళ్ళుగా బడ్జెట్‌ను కంట్రోల్‌ చెయ్యలేని నిర్మాతలు ఉన్నపళంగా పారితోషికాన్ని తగ్గించేస్తానంటే.. కోట్లకు అలవాటు పడిన ఏ నటుడు అంగీకరిస్తాడు. ఏ దర్శకుడు అందుకు సై అంటాడు. 

ఇప్పటి నిర్మాతలంతా కథ కన్నా కాంబినేషన్‌కి విలువిచ్చే వారే. కథకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఫలానా హీరోకి మార్కెట్‌ ఉంది. బిజినెస్‌ బాగా అవుతుంది. ‘ఈ హీరోని ఆ దర్శకుడు మాత్రమే బాగా హ్యాండిల్‌ చేస్తాడు’ అనే పిచ్చి నమ్మకంలో మన నిర్మాతలున్నారు. కోట్ల రూపాయిలు, హీరోలకు దర్శకులకు హీరోయిన్‌లకు వెచ్చిస్తున్నారు. ఎన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా అయినా టాక్‌ బావుంటే వారం లేదా రెండు వారాలు మాత్రమే ఆడుతుంది. రిలీజ్‌(శుక్రవారం)రోజునే నెగిటివ్‌ టాక్‌ వచ్చిదంటే ఆదివారం తర్వాత ఆ సినిమా కలెక్షన్లు శూన్యం. 

నిర్మాతలు మారి కథల మీద కాస్త దృష్టి పెడితే మంచి సినిమాలు తప్పకుండా వస్తాయి. ఇంకాస్త కఠినంగా ఉంటూ బడ్జెట్‌ మీద దృష్టి సారిస్తే అనుకున్న బడ్జెట్‌లో సినిమాలు తీయ్యొచ్చు. కానీ ఇక్కడ మన నిర్మాతలు అనుకున్న బడ్జెట్‌ కన్నా ఎక్కువ ఖర్చయింది అని గొప్పగా చెప్పుకోవడానికి అలవాటు పడ్డారు. ఈ దారి నుండి సరైన గాడిలో పడడానికి కాస్త టైమ్‌ పడుతుంది. 

జనాల్లోకి సినిమాను తీస్కేళ్లే ప్రచార సాధనాలు వల్లే బడ్జెట్‌ కొంత పెరుగుతుందనడం ఎంతవరకు వాస్తవమో నిర్మాతలు ఆలోచించాలి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs