శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. మిక్కిజె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఒక పాటను రేడియో మిర్చి ద్వారా సోమవారం హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ "ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రానికి సంగీతం అందివ్వడానికి మిక్కి జె మేయర్ రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. మా బ్యానర్ లో మిక్కి సంగీతం అందించిన సినిమాలు కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు మ్యూజికల్ గా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అదే కోవలోకి వస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా రెండు, మూడు పాటలు ఈ సంవత్సరం అంతా వినిపిస్తూనే ఉంటాయి. ఈ చిత్రం ఆడియో ఏప్రిల్ 25న ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నాం. మే నెలలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు.
సంగీత దర్శకుడు మిక్కి జె మేయర్ మాట్లాడుతూ "రామజోగయ్యశాస్త్రి గారు మంచి సాహిత్యాన్ని అందించారు. సినిమాలో పాటలు అధ్బుతంగా వచ్చాయి" అని చెప్పారు.
దర్శకుడు సాయికిరణ్ అడవి మాట్లాడుతూ " 'కేరింత' సినిమా మొదలు పెట్టి రెండు సంవత్సరాలు అయింది. మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పని చేసారు" అని చెప్పారు.
Advertisement
CJ Advs