క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ ప్రధాన పాత్రల్లో కాస్మిక్ ఇమాజినేషన్స్ పతాకంపై సతీష్ కార్తికేయ దర్శకత్వంలో వివేకానందవర్మ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ మూవీ ‘వారధి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో క్రాంతి, హీరోయిన్ శ్రీదివ్య, దర్శకుడు సతీష్ కార్తికేయ, సంగీత దర్శకుడు విజయ్ గొర్తి పాల్గొన్నారు.
సతీష్ కార్తికేయ: ఇటీవల విడుదలైన మా చిత్రం ఆడియోకి, టీజర్స్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. అందరికీ నచ్చేలా రూపొందించడం జరిగింది. క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్ చేశారు. విజయ్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి హైలైట్ అవుతుంది. ఒక హిట్ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో వున్నాయి. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. 17న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
క్రాంతి: ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ పేరు వినయ్. ఒక విధమైన శాడిజం వున్న ఫన్నీ క్యారెక్టర్ నాది. ఈ సినిమాలో ఆల్ రౌండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుంది. సాధారణంగా చిన్న సినిమా అంటే వెళ్ళాలా వద్దా అనే కన్‌ఫ్యూజన్‌లో వుంటారు. ఎందుకంటే ఆడియన్స్ పెట్టే డబ్బుకి తగిన ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుందా లేదా అని ఆలోచిస్తారు. ఈ సినిమా విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆడియన్స్ కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా చూశామని శాటిస్‌ఫై అవుతారు. ఇది ఒక ఫీల్‌గుడ్ మూవీగా అందరి ప్రశంసలు అందుకుంటుందని నా నమ్మకం.
శ్రీదివ్య: ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు ఆరాధన. అందరూ ఆరాధించే విధంగానే నా క్యారెక్టర్ వుంటుంది. ఒక అమ్మాయిలో ఎంత ప్రేమ వుంటుంది అనేది నా క్యారెక్టర్ చెప్తుంది. లవ్ ఇలా కూడా చెయ్యవచ్చా అని సినిమా చూసిన తర్వాత మీరందరూ అనుకుంటున్నారు. డైరెక్టర్ సతీష్‌గారికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో ఎక్స్‌పీరియన్స్ వున్న డైరెక్టర్‌లా చేశారు. కొత్త డైరెక్టర్ చేసిన సినిమాలా వుండదు. స్టోరీ విన్నప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో, సినిమా చేసేటపుడు కూడా అంతే ఎక్సైట్ అయ్యాను. డైరెక్టర్‌గారు చాలా పర్‌ఫెక్ట్‌గా తీశారు. ఒక కమర్షియల్ సినిమా ఎలా వుంటే ఆడియన్స్ ఆదరిస్తారో దానికి తగ్గట్టుగానే తీశారు. ఈనెల 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.
విజయ్ గొర్తి: ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సబ్జెక్ట్‌లో మ్యూజిక్‌కి చాలా ఇంపార్టెన్స్ వుంది. అలాగే రీరికార్డింగ్ కూడా చాలా బాగా కుదిరింది. సినిమా అందరికీ నచ్చుతుంది.
క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి, రంగనాథ్, సి.వి.యల్.సూర్య, బెంగళూర్ పద్మ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సాహిత్యం: చైతన్య వర్మ, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, సంగీతం: విజయ్ గొర్తి, కెమెరా: రాజేంద్రకేసాని, నిర్మాత: వివేకానంద వర్మ, రచన`దర్శకత్వం: సతీస్ కార్తికేయ.