Advertisement
Google Ads BL

చంద్రబాబునాయుడు విడుదల చేసిన ‘లయన్‌’ ఆడియో


నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్‌.ఎల్‌.వి సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్త్తోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లయన్‌’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఏప్రిల్‌ 9న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని నందమూరి బాలకృష్ణకు అందించారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను నందమూరి రామకృష్ణ, బోయపాటి శ్రీను, పరిటాల శ్రీరామ్‌ విడుదల చేశారు. మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో లహరి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. మొట్టమొదటిసారిగా 3డి సెట్‌లో ఈ ఆడియో ఫంక్షన్‌ను నిర్వహించడం విశేషం. ఈ ఆడియో ఫంక్షన్‌లో చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు తెలుగుదేశం పార్టీకి 5 లక్షలు, బసవతారకం క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి 5 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా...

Advertisement
CJ Advs

నందమూరి బాలకృష్ణ: నాన్నగారి ఆశయాలు, దేవుడి ఆశీర్వాదం, అభిమానుల బలం ఉన్నంత వరకు బాలకృష్ణ ఎప్పుడూ లయన్‌ గానే ఉంటాడు. నా అభిమాని అయిన రుద్రపాటి రమణారావుగారు ఈ సినిమాతో నిర్మాత అయ్యారు. ఈ సినిమాతో సత్యదేవగారు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సత్యదేవ సినిమాని నాకు తగిన విధంగా మలిచారు. సినిమాలో చాలా షేడ్స్‌ ఉన్నాయి. మణశర్మగారితో గతంలో ఎన్నో హిట్‌ చిత్రాలకు పనిచేశారు. ఈ చిత్రంలో కూడా ఐదు అద్భుతమైన సాంగ్స్‌ ఇచ్చారు. లెజెండ్‌ మే 2న 400రోజులు వేడుకను చంద్రబాబునాయుడిగారు సమక్షంలో జరుపుకోనున్నాం. ఈ విజయాలన్నీ తెలుగు అభిమానులదే. త్వరలోనే సినిమా విడుదల కానుంది. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, అభిమానులు కోరుకున్న విధంగానే సినిమా ఉంటుంది. 

నారా చంద్రబాబు నాయుడు: సమరసింహారెడ్డి, నరసింహనాయుడు  చిత్రాల ఆడియో నేనే విడుదలను ముఖ్యమంత్రిగా ఉండి చేస్తే ఆ సినిమాలు చరిత్రలు సృష్టించాయి. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చాను. ఎన్టీఆర్‌ గారికి, బాలకృష్ణగారికి సింహం అనే పేరు బాగా కలిసి వచ్చింది. తెలుగు చలనచిత్ర రంగంలో  లయన్‌ చిత్రం చరిత్ర సృష్టిస్తుంది. బాలయ్యకు ఎవరూ పోటీ కాదు. బాలయ్యకు బాలయ్యే పోటీ. అప్పట్లో ఎన్టీఆర్‌గారు ఏ క్యారెక్టర్‌ చేసినా ఆయనకు ఎవరూ పోటీ లేరు. నేను సవాలు విసురుతున్నా..ఇలాంటి క్యారెక్టర్‌ చేసే వాళ్లు తెలుగులో ఎవరూ లేరు. అది ఒక బాలయ్యకే సాధ్యం. సత్యదేవ్‌ తాతగారు సంగీత్‌ వెంకట్‌రెడ్డిగారు నాతో మినిష్టర్‌గా పనిచేశారు. ట్రైలర్‌ చూస్తుంటే చాలా బాగుంది. రాబోయే రోజుల్లో లయన్‌ బాలకృష్ణ గత చిత్రాల రికార్డుని బద్ధలు కొడుతుంది. కనీసం ఒక ఏడాది అడుతుందని భావిస్తున్నాను. 

సత్యదేవ్‌:  బాలయ్యతో మణిశర్మగారు చేస్తున్న పదమూడవ సినిమా. ఆడియో సింహా, లెజెండ్‌లకు ఏమాత్రం తగ్గదు. నిర్మాతగారు గట్స్‌ తో ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. సింహా రిలీజ్‌ కాకముందే ఈ కథను ఆయనకు చెప్పాను. అప్పటి నుండి ఆయనతోనే ట్రావెల్‌ చేస్తున్నాను. లెజెండ్‌ తర్వాత సినిమా డైరెక్టర్గ గా నాకు అవకాశం ఇచ్చారు. స్క్రీన్‌ మీదనే కాదు, రియల్‌ గా కూడా బాలకృష్ణగారు హీరోనే. లయన్‌ అనే టైటిల్‌ పేటెంట్‌ హక్కు కలిగిన హీరో బాలకృష్ణగారికే సొంతం. ఇచ్చిన మాట తప్పని వ్యక్తి. గ్రేట్‌ లయన్‌. టెక్నికల్‌ మిక్స్‌ అయన స్క్రిప్ట్‌ను నమ్మి సినిమా చేశారు.

రుద్రపాటి రమణారావు: బాలయ్యబాబు హీరోగా నేను సినిమా నిర్మిస్తానని అనుకోలేదు. అభిమానులను నిర్మాతగా మార్చే ధైర్యం ఒక నందమూరి వంశానికే సాధ్యం. లెజెండ్‌ టైమ్‌లో ఈ సినిమా చేస్తామని నాతో అన్నారు. అన్నట్లుగానే సినిమా చేశారు. లెజెండ్‌ వంటి హిట్‌ తర్వాత ఎంత మంది నిర్మాతలు ఆయన్ని సంప్రదించినా ఆయన నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బోయపాటి శ్రీను:  లయన్‌  98వ సినిమా. ఈ లెక్కలన్నీ అభిమానులకే బాలయ్యబాబు గారు మాత్రం ప్రతి సినిమాని తొలి సినిమాగానే భావించి చేస్తారు. తప్పకుండా లయన్‌ చిత్రం బాలయ్యగారికి మరో హిట్‌ అవుతుంది. మణిశర్మగారు చాలా గ్యాప్‌ తర్వాత బాలయ్యగారి సినిమాకి కసితో మ్యూజిక్‌ ఇచ్చారు. వీరి కాంబినేషన్‌ లో వచ్చిన సినిమాలన్నీ పెద్ద హిట్‌ మూవీస్‌. అలాగే ఈ ఆడియో, సినిమా పెద్ద హిట్టవుతుంది. 

త్రిష:  బాలకృష్ణగారితో ఎప్పుడో సినిమా చేయాల్సింది. అది ఇప్పటికి కుదిరింది. మూడు సంవత్సరాలు తర్వాత తెలుగు విడుదలవుతున్న బిగ్‌ సినిమా ఇది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్‌. మణిశర్మగారికి మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. 

జయసుధ: నేనొక ముఖ్యపాత్ర చేశాను. డిఫరెంట్‌ మూవీ. లెజెండ్‌ కంటే పెద్ద హిట్టవుతుంది. మణిశర్మ బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. వందరోజుల వేడుకను సెలబ్రేట్‌ చేసుకోవాలి.

ఈ కార్యక్రమంలో కె.ఎల్‌.నారాయణ, కొర్రపాటి సాయి, మాగంటి గోపి, రేవంత్‌ రెడ్డి, బోయపాటి శ్రీను, ఆంధ్రప్రదేవ్‌ విప్‌ యామిని బాల, అంబికా కృష్ణ, నందమూరి రామకృష్ణ, పరిటాల శ్రీరామ్‌, లహరి మనోహర్‌ నాయుడు, శ్రీవాసు, అనిల్‌ రావిపూడి, ఎల్‌.రమణ, సమీర్‌, శ్రవణ్‌, గౌతంరాజు, సినిమాటోగ్రాఫర్‌ ప్రసాద్‌, చిత్రలేఖ, డైమండ్‌ రత్నం, సాయికొర్రపాటి, రావమ్‌ అచంట, గోపి అచంట,  తదితరులు పాల్గొని చిత్రయూనిట్‌ను అభినందించారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs