Advertisement
Google Ads BL

వినోదాన్ని పంచేందుకు ‘కలియుగ పరమానందయ్య’ వస్తున్నాడు


1966లో విడుదలైన ‘పరమానందయ్య శిష్యుల కథ’ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. చక్కని హాస్యాన్ని అందించిన చిత్రంగా ‘పరమానందయ్య శిష్యుల కథ’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం వుంది. రేపటికి అంటే ఏప్రిల్‌ 7కి ఆ చిత్రం విడుదలై 49 సంవత్సరాలు పూర్తి చేసుకొని 50వ సంవత్సరంలోకి ప్రవేశిస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫిలిం ఫ్లవర్‌ మీడియా సొల్యూషన్స్‌ సంస్థ తాము నిర్మించబోతున్న ‘కలియుగ పరమానందయ్య’ చిత్రానికి సంబంధించిన విశేషాలను తెలిపేందుకు సోమవారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు వి.యు.ఎ.ఎ.రావు, ఎన్‌.వి.బి.చౌదరి, పరమానందయ్యగా నటిస్తున్న కిశోర్‌దాస్‌, శిష్యులుగా నటిస్తున్న వినోద్‌, దుర్గాజీ, కార్తీక్‌, తాజుద్దీన్‌, అరవింద్‌, మోహన్‌, ఆదిత్య, యువకళావాహిని వై.కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

ఎన్‌.వి.బి.చౌదరి: ఆస్కార్‌ నామినేషన్స్‌కి వెళ్ళిన ‘మిణుగురులు’ చిత్ర కథా రచయితగా నేను మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం నా దర్శకత్వంలో ‘కీచక’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా విషయానికి వస్తే నా మిత్రుడు వి.యు.ఎ.ఎ.రావు ఈ చిత్రానికి చాలా మంచి టైటిల్‌ పెట్టాడు. ఇది చాలా అట్రాక్టివ్‌ టైటిల్‌. పరమానందయ్య శిష్యుల కథ అనేది మన సంస్కృతిలో ఒక భాగం. తెలుగులో హాస్యానికి పెట్టింది పేరు ఈ సినిమా. యాభై ఏళ్ళ ఈ క్లాసిక్‌ని రీమేక్‌ చేస్తూ మోడ్రన్‌ వెర్షన్‌లో చేయడమనేది ఒక సాహసం. ఈ చిత్ర దర్శకుడు రావుకి కథ మీద, కథనం మీద మంచి పట్టు వుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని బాగా తీస్తాడన్న నమ్మకం నాకు వుంది. 

వి.యు.ఎ.ఎ.రావు: సినిమాలకు సంబంధించిన అన్ని ఫార్ములాలు చౌదరిగారికి తెలుసు. సినిమాలకు సంబంధించి కొన్ని లక్షలు విలువ చేసే పుస్తకాలు ఆయన దగ్గర వున్నాయి. యాభై సంవత్సరాల క్రితం వచ్చిన పరమానందయ్య శిష్యుల కథని ఒక హిట్‌ ఫార్ములాలో చెయ్యబోతున్నాం. అప్పటి తరానికి చెందిన పరమానందయ్య, అతని శిష్యులు కలియుగంలోకి ఒక పీరియడ్‌ టైమ్‌లో వచ్చి వెళ్ళిపోతారు. వచ్చినపుడు వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేది కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రానికి వున్న ప్రాధాన్యత దృష్ట్యా మల్టీ లాంగ్వేజెస్‌ చెయ్యాలని మా నిర్మాత భావిస్తున్నారు. రెండు నెలల్లో షూటింగ్‌ ప్రారంభించి వినాయకచవితికి సినిమాని రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం. 

కిశోర్‌దాస్‌: రావుగారు నాకు చాలా కాలంగా తెలుసు. ఈ సినిమా గురించి చెప్పినపుడు పరమానందయ్య క్యారెక్టర్‌ని అప్పట్లో చిత్తూరు నాగయ్యగారు చేశారు. ఆ క్యారెక్టర్‌ నేను చెయ్యడం చాలా ఆనందం కలిగింది. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

వినోద్‌: పరమానందయ్య శిష్యులుగా రాజబాబుగారు, పద్మనాభంగారు, అల్లు రామలింగయ్యగారులాంటి గొప్ప నటులు చేశారు. ఆ క్యారెక్టర్లు మేం చెయ్యడం అంటే సాహసమనే చెప్పాలి. ఇలాంటి మంచి సినిమా చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాం. 

వై.కె.నాగేశ్వరరావు: ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. రావుగారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీస్తారన్న నమ్మకం నాకు వుంది. అప్పటి పరమానందయ్యకి ఏడుగురు శిష్యులు వుంటే ఈ పరమానందయ్యకి ఎనిమిది మంది శిష్యులు వుంటారు. ఎనిమిది మంది శిష్యులతో ఈ పరమానందయ్య ఎలాంటి వినోదాన్ని పంచుతాడో త్వరలోనే తెలుస్తుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs