Advertisement
Google Ads BL

మరోసారి యాక్షన్‌ మూవీ చేస్తున్న తనీష్‌


తనీష్‌ హీరోగా, మోహిత హీరోయిన్‌గా యశస్విని సమర్పణలో శ్రీచీర్ల మూవీస్‌ పతాకంపై సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో శ్రీనివాస యాదవ్‌ ప్రొడక్షన్‌ నెం.1గా నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. హీరో తనీష్‌, హీరోయిన్‌ మోహిత, రాధాకృష్ణలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు క్లాప్‌నివ్వగా, మేగోటి ఉమామహేశ్వరి, శిరీష కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో తనీష్‌, హీరోయిన్‌ మోహిత, దర్శకుడు సంజీవ్‌ మేగోటి, నిర్మాత శ్రీనివాస యాదవ్‌, నటులు అజి జోసెఫ్‌, రాధాకృష్ణ, మిత్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

సంజీవ్‌ మేగోటి: దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేస్తున్నాను. తెలుగులో నా చివరి సినిమా ‘పౌరుషం’. ఆ చిత్రం తర్వాత కన్నడలో సినిమాలు చేస్తూ బిజీగా వున్నాను. కన్నడలో నేను చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలకు నేనే నిర్మాతను. తనీష్‌ హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సైనికుడు సైన్యంలో వుండాలి, సగటు మనిషి సంఘంలో వుండాలి అనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. తెలుగులో మళ్ళీ నేను డైరెక్టర్‌గా రీ ఎంట్రీ ఇవ్వాలంటే అది మంచి సినిమా అయి వుండాలి, ఒక మంచి హీరోతో చెయ్యాలి అనుకొని నేను రెడీ సబ్జెక్ట్‌కి తనీష్‌ అయితే పర్‌ఫెక్ట్‌గా వుంటాడని భావించి అతనికి కథ చెప్పడం జరిగింది. తనీష్‌కి కూడా కథ బాగా నచ్చింది. ఈ సినిమాలో తనీష్‌ డైలాగ్స్‌గానీ, స్టైల్‌గానీ చాలా కొత్తగా వుంటూ అందర్నీ ఆకట్టుకుంటాయి. సాయికుమార్‌గారు ఈ సినిమాలో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇవ్వబోతున్నారు. ఈరోజు ప్రారంభమైన ఈ షెడ్యూల్‌ 10 రోజులపాటు హైదరాబాద్‌లోనే వుంటుంది. ఆ తర్వాత బెంగుళూరు, గోవా, తిరుపతి వంటి లొకేషన్స్‌లో టోటల్‌గా 50 రోజుల్లో షూటింగ్‌ కంప్లీట్‌ చేస్తాం. పాటల్ని శ్రీలంకలో తియ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం. 

శ్రీనివాస యాదవ్‌: ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో చేస్తున్న సినిమా ఇది. సంజీవ్‌గారు కన్నడలో ‘దండు’ సినిమా షూటింగ్‌లో వున్నప్పుడు ఈ కథ చెప్పారు. ఈ సబ్జెక్ట్‌తో తనీష్‌గారిని అప్రోచ్‌ అయ్యాం. ఆయనకు కూడా బాగా నచ్చింది. ఆయన బిజీ షెడ్యూల్స్‌తో వున్నప్పటికీ మా కోసం డేట్స్‌ కేటాయించారు. మా బేనర్‌లో చేస్తున్న ఈ మొదటి సినిమా మాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.

తనీష్‌: స్టైలిష్‌గా వుండే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. చాణుక్యుడు సినిమా చేసినపుడు ఆ సినిమాలో నాకు యాక్షన్‌ హెవీ అవుతుందనుకున్నాను. అలాగే జరిగింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి సినిమా చెయ్యలేదు. సడన్‌గా ఈ ప్రాజెక్ట్‌ నా దగ్గరికి వచ్చింది. సంజీవ్‌గారు చెప్పిన కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది. ఇది ఒక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఇలాంటి యాక్షన్‌ మూవీ ఇప్పుడు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు అనిపించింది. ఇందులో హీరోగా కంటే యాక్టర్‌గా నాకు ఎక్కువ స్కోప్‌ వుంది. దీన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకొని చేస్తున్నాను. ఇందులో హీరో క్యారెక్టర్‌ పాజిటివ్‌గా వుంటుంది, నెగెటివ్‌గానూ వుంటుంది. ఇది ఒక టిపికల్‌ క్యారెక్టర్‌. ఈ చిత్రంతో నేను యాక్టర్‌గా శాటిస్‌ఫై అవుతాను. సేమ్‌టైమ్‌ ఇది నా కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌లాంటి సినిమా అవుతుందన్న నమ్మకం వుంది.

మోహిత: తెలుగులో ఇది నా మొదటి సినిమా. కన్నడలో కొన్ని సినిమాలు చేశాను. సంజీవ్‌గారు చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. నా రియల్‌ లైఫ్‌కి పూర్తిగా డిఫరెంట్‌గా వుండే క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేస్తున్నాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. 

తనీష్‌, మోహిత, అజి జోసెఫ్‌, గౌతంరాజు, రఘుబాబు, ధన్‌రాజ్‌, మిత్ర, ఢల్లీి రాజేశ్వరి, రాధాకృష్ణ, దేవిశ్రీప్రభు, సుందర్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హయీష్‌ ఎస్‌.ఎన్‌., ఎడిటింగ్‌: వెంకటేష్‌, ఫైట్స్‌: థ్రిల్లర్‌ మంజు, సతీష్‌, స్క్రిప్ట్‌ కోఆర్డినేషన్‌: అంజన్‌, ఉమ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఘంటా శ్రీనివాసరావు, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: సంజీవ్‌ మేగోటి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs