ఇటీవలే విడుదలైన 'టెంపర్' చిత్రంతో తిరిగి సక్సెస్‌బాట పట్టారు ఎన్టీఆర్. ఈ విజయోత్సవాన్ని ఆస్వాదిస్తున్న ఆయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రతీకార నేపథ్యంలో తండ్రి కొడుకుల కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'నాన్నకు ప్రేమతో' అనే పేనును ఖరారు చేసినట్లు తెలిసింది. కథకు సరిపోయే టైటిల్ కోసం కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్న సినిమా యూనిట్ ఈ పేరునే ఖరారు చేసినట్లు తెలిసింది. భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 17నుంచి లండన్‌లో ప్రారంభం కానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణ కొత్త పంథాలో సాగుతుందని, ఆయన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా '1' సినిమా ప్లాఫ్‌తో రేసులో వెనుకబడ్డ సుకుమార్ ఎన్టీఆర్ చిత్రంతో తిరిగి ట్రాక్‌లోకి రావాలని కష్టపడుతున్నారు.