Advertisement
Google Ads BL

‘రేయ్‌’ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌


సాయిధరమ్‌తేజ్‌ హీరోగా, సయామీఖేర్‌ హీరోయిన్‌గా, శ్రద్ధా దాస్‌ ఓ ప్రత్యేక పాత్రలో యలమంచిలి గీత సమర్పణలో బొమ్మరిల్లు పతాకంపై వై.వి.యస్‌.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రేయ్‌’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి చక్రి సారధ్యంలో రూపొందిన పాటలు చాలా ప్లస్‌ అయ్యాయి. సినిమా రిలీజ్‌ తర్వాత ఈ పాటలకు స్పందన పెరిగి ప్లాటినం డిస్క్‌ దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్లాటినం డిస్క్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆర్‌.నారాయణమూర్తి, సాగర్‌ విచ్చేయగా, హీరో సాయిధరమ్‌తేజ్‌, సంగీత దర్శకుడు చక్రి సతీమణి శ్రావణి, ఎడిటర్‌ గౌతంరాజు, మాటల రచయిత శ్రీధర్‌ సీపాన, గేయ రచయిత చంద్రబోస్‌, నటులు నోయల్‌, మణికిరణ్‌, మధు, డాన్స్‌మాస్టర్స్‌ ప్రేమ్‌రక్షిత్‌, జానీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా యూనిట్‌ సభ్యులకు షీల్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

ఆర్‌.నారాయణమూర్తి: చౌదరి నాలుగు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాడు. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయి వుంటే ఈ ఫంక్షన్లు వుండవు. అలాగే ఫ్లాప్‌ అయినా ఏ ఫంక్షనూ వుండదు. కానీ, ఈ సినిమా ఒక మంచి సినిమాగా అందరి ఆదరణ పొందుతోంది. అయితే వరల్డ్‌కప్‌ టైమ్‌, ఎగ్జామ్స్‌ టైమ్‌లో సినిమాని రిలీజ్‌ చెయ్యడం వల్ల యూత్‌ ఆడియన్స్‌ థియేటర్‌కి రావడం లేదు. మాస్‌లోకి సినిమా వెళ్ళింది. యూత్‌ ఆడియన్స్‌ కూడా వస్తే సినిమా రేంజ్‌ పెరుగుతుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరణ కూడా వుంటే దేవదాసు అంతటి హిట్‌ అవుతుంది. తను పడిన కష్టానికి మంచి పేరు వస్తే చాలు, డబ్బు రాకపోయినా ఫర్వాలేదు అంటున్నాడు చౌదరి. అది కరెక్ట్‌ కాదు. పేరు ఎలాగూ వస్తుంది. డబ్బు కూడా రావాలి. మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు తియ్యాలి. ‘రేయ్‌’ చిత్రానికి ఆదరణ పెరుగుతుంది. తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది.

సాగర్‌: సినిమా అంటే ప్యాషన్‌, సిన్సియారిటీ, వర్క్‌ డెడికేషన్‌ వున్న డైరెక్టర్‌ వై.వి.యస్‌.చౌదరి. అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. రోజురోజుకీ కలెక్షన్స్‌ పెరుగుతున్నాయని తెలిసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా థియేటర్స్‌కి వస్తే ఇంకా పెద్ద హిట్‌ అవుతుంది. 

ప్రేమ్‌రక్షిత్‌: ఈ సినిమాలో క్లైమాక్స్‌ సాంగ్‌ చేయడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. చౌదరిగారి సినిమాలో ప్రతి పాటకూ ఒక కాన్సెప్ట్‌ వుంటుంది. క్లైమాక్స్‌ సాంగ్‌ ఎక్కువ బీజియమ్‌తోనే నడుస్తుంది. దానికి సాయిధరమ్‌ ఎక్స్‌ట్రార్డినరీగా డాన్స్‌ చేశాడు. ఈ పాటను ఆడియన్స్‌ ఇంత బాగా ఎంజాయ్‌ చేస్తున్నారంటే ఆ క్రెడిట్‌ అంతా చౌదరిగారికే చెందుతుంది. 

శ్రీధర్‌ సీపాన: ఈ సినిమాకి మాటలు రాయడం స్టార్ట్‌ చేసినపుడే ప్రతి డైలాగ్‌ బాణంలా వుండాలని చౌదరిగారు చెప్పారు. థియేటర్‌లో ప్రతి డైలాగ్‌కి విజిల్స్‌ వేస్తున్నారు. మేం అనుకున్న టార్గెట్‌ని రీచ్‌ అయినందుకు చాలా హ్యాపీగా వుంది.

శ్రావణి: ఈ సినిమా ఇంత విజయం సాధించినందుకు యూనిట్‌ అందరికీ కంగ్రాట్స్‌. ఈ సినిమా పాటల్లో ఆయన్నే చూసుకుంటున్నాను. ప్రతి పాట చాలా బాగుండాలని ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈ ఫంక్షన్‌కు ఆయన వుంటే ఎంతో బాగుండేది. 

సాయిధరమ్‌తేజ్‌: ఈ ఫంక్షన్‌ చక్రిగారిది. ఆయన లేని లోటు మాకు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన చేసిన ఈ పాటలు ఇంత పెద్ద విజయం సాధించినందుకు చాలా సంతోషంగా వుంది. చక్రిగారు ఎక్కడ వున్నా ఆయన ఆశీస్సులు మాకు వుంటాయి. 

వై.వి.యస్‌.చౌదరి: నాలుగు సంవత్సరాలు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. అయితే అందరం ఎంతో ఇష్టపడే కష్టపడ్డాం. మంచి ట్యూన్స్‌ చెయ్యడానికి చక్రిని, మంచి పాటలు రాయడానికి చంద్రబోస్‌గారిని ఎంతో కష్టపెట్టాను. ఫైనల్‌గా మంచి పాటలు వచ్చాయి. ఈ సినిమా రిలీజ్‌ అయ్యే టైమ్‌కి, ఈ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ జరుపుకుంటున్న టైమ్‌కి చక్రి లేకపోవడం ఎంతో బాధగా వుంది. నా బాడీలో ఒక అవయవం పోయినంత బాధపడుతున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే ఇది రెగ్యులర్‌ ఫార్మాట్‌లో వుండే సినిమా కాదు. రెగ్యులర్‌గా మీరు చూసే కథ కాదు. వేరే దేశాల నేటివిటీకి, మన నేటివిటీని లింక్‌ చేస్తూ చేసిన సినిమా. అందరూ ఇది మ్యూజిక్‌ బేస్డ్‌, డాన్స్‌ బేస్డ్‌ మూవీ అనుకుంటున్నారు. కానీ, ఇది ప్యూర్‌ లవ్‌స్టోరీ. ఒక అమ్మాయి తన ఆశయం సాధించడానికి సహాయం చేయడం ద్వారా ఆ అమ్మాయి ప్రేమను పొందిన ఒక యువకుడి కథ. ఈ కాన్సెప్ట్‌ మాస్‌ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది. ఇక యూత్‌కి కూడా కథ చేరాల్సిన అవసరం వుంది. ఎగ్జామ్స్‌ వల్ల యూత్‌ చూడడానికి వీలు పడలేదు. ఇప్పుడిప్పుడే యూత్‌ కూడా వస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న కలెక్షన్సే దానికి నిదర్శనం. నేను చేసిన దేవదాసు కూడా ఇలాగే స్లోగా పికప్‌ అయింది. ఆ సినిమా చేసిపుడు కూడా ఆడియన్స్‌ నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా అదే ప్రోత్సాహం లభిస్తోంది. తప్పకుండా ఈ సినిమా దేవదాసు రేంజ్‌కి వెళ్తుందన్న నమ్మకం నాకు వుంది. ఈ సినిమా కోసం పవనిజం పేరుతో ఒక సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. దాని షూటింగ్‌ కూడా ఈమధ్యే ఫినిష్‌ చేశాం. సెన్సార్‌ పూర్తి చేసి శుక్రవారం నుంచి ‘రేయ్‌’ చిత్రం ప్రదర్శింపబడుతున్న అన్ని థియేటర్లలో ఈ పాటను అందుబాటులోకి తెస్తున్నాం. ఈ పాట తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మా చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs