గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా యువి క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జిల్’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న నేపథ్యంలో సోమవారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సక్సెస్‌మీట్‌లో హీరో గోపీచంద్, హీరోయిన్ రాశిఖన్నా, దర్శకుడు రాధాకృష్ణకుమార్, నిర్మాతలు వంశీ, ప్రమోద్, నటులు చలపతిరావు, అమిత్‌కుమార్, చింటూ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
రాధాకృష్ణకుమార్: మా చిత్రానికి వస్తోన్న ట్రెమండస్ రెస్పాన్స్ చూసి మేం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సినిమా బాగుందని చాలా కాల్స్ వస్తున్నాయి. గోపీచంద్‌గారి క్యారెక్టర్‌కి, ఆయన పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే రాశిఖన్నా చేసిన సావిత్రి క్యారెక్టర్‌ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక డైరెక్టర్‌గా నాకు ఒక విజన్ వుంటుంది. దాన్ని హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ మీద చూపించాలంటే దానికి తగ్గ ప్రొడ్యూసర్స్ కావాలి. ఈ చిత్ర నిర్మాతలు వంశీగారు, ప్రమోద్‌గారు నన్ను బాగా సపోర్ట్ చేశారు. టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌కి వస్తే ఎ.ఎస్.ప్రకాష్‌గారు చాలా మంచి సెట్స్ వేశారు. ముఖ్యంగా స్మశానంలో రెయిన్ ఎఫెక్ట్‌లో తీసిన ఫైట్ ఎక్కడ తీశారని అడుగుతున్నారు. నిజానికి అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసి తీశాం. ప్రకాష్‌గారు ఆ సెట్‌ని ఎక్స్‌ట్రార్డినరీగా వేశారు. అనల్ అరసుగారి ఫైట్స్ చాలా డిఫరెంట్‌గా కంపోజ్ చేశారు. ఇలా యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చలపతిరావు: ఈ సినిమా నిర్మాతలకు హ్యాట్రిక్ ఇచ్చింది, అలాగే మా గోపీచంద్‌కి హ్యాట్రిక్ ఇచ్చింది. డెట్రాయిట్‌లో వున్న మా అమ్మాయి ఫోన్ చేసింది. అక్కడ మూడు షోలు ఫుల్స్ అయ్యాయట. జనరల్‌గా అక్కడ అన్ని షోలు హౌస్‌ఫుల్ అవడం జరగదు. ఈ సినిమాకి జరిగిందంటే సినిమా ఏ రేంజ్‌లో ఆడుతోందో అర్థం చేసుకోవచ్చు.
రాశిఖన్నా: ఈ సినిమాలో నాకు సావిత్రిలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ రాధాకృష్ణగారికి థాంక్స్. అలాగే ఈ సినిమాని పెద్ద హిట్ చేసిన లవ్‌లీ ఆడియన్స్‌కి స్పెషల్ థాంక్స్.
అమిత్‌కుమార్: ఈ బేనర్‌లో నేను ఫస్ట్ టైమ్ చేశాను. డైరెక్టర్‌గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నా ఇంట్రడక్షన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారని ఫోన్లు చేసి చెప్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు.
గోపీచంద్: రాధాకృష్ణ నాకు చెప్పిన కథని హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ మీద చూపించాడు. అలాగే నన్ను చాలా కొత్తగా చూపించాడు. నా ఫ్రెండ్స్ వంశీ, ప్రమోద్‌లు సినిమా అంటే చాలా ప్యాషనేటెడ్‌గా వుంటారు. ఈ బేనర్‌కి ‘జిల్’ హ్యాట్రిక్ మూవీ అయినందుకు హ్యాపీగా వుంది. అలాగే నా వెనక వుండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రభాస్‌కి థాంక్స్. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్థతలు తెలియజేస్తున్నాను.