Advertisement
Google Ads BL

విడుదలకు సిద్ధమైన ‘మిస్‌ లీలావతి’


సొంత ఊరు, గంగపుత్రులు, రొమాంటిక్‌ క్రైమ్‌ కథ, ఒక క్రిమినల్‌ ప్రేమకథ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన పి.సునీల్‌కుమార్‌రెడ్డి తాజాగా కీ ఫిలింస్‌ సమర్పణలో శ్రావ్య ఫిలింస్‌ ప్రొడక్షన్‌ పతాకంపై యక్కలి రవీంద్రబాబు నిర్మాతగా రూపొందిస్తున్న మరో డిఫరెంట్‌ మూవీ ‘మిస్‌ లీలావతి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో చిత్రంలోని పాటలను, మేకింగ్‌ వీడియోలను పాత్రికేయుల కోసం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి, నిర్మాత యక్కలి రవీంద్రబాబు, నటులు కార్తీక్‌, మహేష్‌, సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.వి.శివరాం, సంగీత దర్శకుడు ప్రవీణ్‌ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ బి.బాపిరాజు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

పి.సునీల్‌కుమార్‌రెడ్డి: ప్రతి మనిషి చుట్టూ వుండే సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేయడం జరిగింది. పోలీస్‌ వారి లెక్కల ప్రకారం ఈ మోడ్రన్‌ సొసైటీలో ఎక్కువ క్రైమ్స్‌ జరుగుతోంది అక్రమ సంబంధాలవల్లే. ఆ రిలేషన్స్‌ వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనేది సందేశాత్మకంగా రూపొందించడం జరిగింది. ప్రకృతికి, మనిషికి వుండాల్సిన బ్యాలెన్స్‌ అనేది తప్పడం వల్ల సునామీ, హుద్‌హుద్‌ వంటి విపత్తులు సంభవిస్తాయి. అలాగే భర్త, భార్య మధ్య బ్యాలెన్స్‌ అనేది లేకపోవడంవల్ల ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుంది అనేది చెప్పాం. తప్పకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. ఏప్రిల్‌ 3న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్‌ 6న రిలీజ్‌ చేస్తున్నాం. 

ప్రవీణ్‌ ఇమ్మడి: ఇది ఒక రొమాంటిక్‌ కామెడీ. ఈ సినిమా చూసి ఎవ్వరూ డిజప్పాయింట్‌ అవ్వరు. పాటలు బాగా వచ్చాయి. అలాగే రీరికార్డింగ్‌ కూడా బాగా కుదిరింది. ఏప్రిల్‌ 3 న సినిమా, 6న ఆడియో రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమా చూసి, పాటలు విని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.

ఎస్‌.వి.శివరాం: హుద్‌హుద్‌ వచ్చిన తర్వాత మూడో రోజు అక్కడి విజువల్స్‌ని క్యాప్చర్‌ చేయడం జరిగింది. ఆ తర్వాత 42 రోజులు ఈ చిత్రం షూటింగ్‌ చేశాం. ఈ సినిమా చూస్తే చాలా మందికి వారి ఫ్లాష్‌బ్యాక్‌ గుర్తొస్తుంది. అలా ఎందుకు చేశామా అని ఆలోచిస్తారు. 

కార్తీక్‌: వైజాగ్‌ లాంటి అందమైన సిటీని హుద్‌హుద్‌వల్ల ఎలా అయిందో అలాగే ఒక అందమైన అబ్బాయి జీవితంలోకి మిస్‌ లీలావతి వస్తే ఏం జరిగిందీ అనేది కథాంశంగా డైరెక్టర్‌గారు చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయి మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.

మహేష్‌: గంగపుత్రులు తర్వాత ఈ సినిమాలో కూడా నాకు మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. మా కెమెరామెన్‌ శివరాంగారి ఫోటోగ్రఫీ చాలా ఎక్స్‌లెంట్‌గా వుంటుంది. అలాగే మా డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌రెడ్డిగారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. 

బాపిరాజు: 35 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్‌లో వున్నాను. గత 10 సంవత్సరాలుగా సునీల్‌కుమార్‌రెడ్డిగారితో ట్రావెల్‌ అవుతున్నాను. మా బేనర్‌లో మొదటి నుంచి తీసిన సినిమాల్లో ఏదో ఒక మెసేజ్‌ వుంటూనే వుంది. అలాగే ఈ సినిమాలో కూడా అందర్నీ ఆలోచింపజేసే మెసేజ్‌ వుంది. అందరూ తప్పకుండా చూడాలని కోరుతున్నాను.

యక్కలి రవీంద్రబాబు: కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఎక్కడా బోర్‌ అనేది లేకుండా చాలా స్పీడ్‌గా వుంటుంది. మా డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌రెడ్డిగారు చాలా బాగా తీశారు. మా బేనర్‌లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా వుండే సినిమా ఇది. ఏప్రిల్‌ 3న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాకి ఘనవిజయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను.

కార్తీక్‌, లీలావతి, మహేష్‌, దివ్య విజ్జు, ఎఫ్‌.ఎం.బాబాయ్‌, గీతా, మల్లిక శృతి, సముద్రం వెంకటేష్‌, బుగత సత్యనారాయణ, రాజా జి. తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.శివరాం, ఎడిటింగ్‌: శివప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాపిరాజు, కోప్రొడ్యూసర్స్‌: కుర్రా విజయ్‌కుమార్‌, శాంతయ్య, నిర్మాత: యక్కలి రవీంద్రబాబు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పి.సునీల్‌కుమార్‌రెడ్డి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs