రామానాయుడు గారి మరణం నుండి అందరూ కోలుకుంటున్నారు. ఆయన కుటుంబసభ్యలు కూడా ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని జీర్ణించుకోగలుగుతున్నారు. కాగా నాయుడు గారికి ఓ కోరిక ఉండేది. అక్కినేని కుటుంబం ‘మనం’లాగా తమ కుటుంబంలోని కొడుకు వెంకటేష్, మనవళ్లు రానా, నాగచైతన్యలతో ఓ సినిమా చేయాలని ఆయన కోరిక. ఈ కోరిక ఇప్పటికైనా కార్యరూపం దాల్చడంపై ఆయన పెద్ద కుమారుడు సురేష్‌బాబు ప్రయత్నాలు మొదలుపెట్టాడని సమాచారం. తనకు బాగా తెలిసిన కొందరు దర్శకులను, రచయితలను వీరి కోసం ఓ మంచి కథ సిద్దం చేయమని సూచించాడట. మొత్తానికి త్వరలో మనం మరో ‘మనం’ చూడటం ఖాయం అని చెప్పవచ్చు.