Advertisement
Google Ads BL

నాకే కాదు తనకు కూడా అవార్డ్‌ రావాలి..!!




‘క్వీన్‌’ సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డ్‌ సొంతం చేసుకుంది ఫ్యాషన్‌స్టార్‌ కంగనారనౌత్‌. గతంలో ఫ్యాషన్‌ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా నేషనల్‌ అవార్డ్‌ అందుకున్నప్పటికీ ఈ సారి అవార్డ్‌ అందుకోబోతుండడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతోంది. మామూలుగా కంగనా అవార్డ్‌ వేడుకలకు దూరం అనే విషయం తెలిసిందే. కంగనా మాట్లాడుతూ ‘‘తొమ్మిదేళ్ళ సినీ కెరీర్‌లో రెండు నేషనల్‌ అవార్డ్‌లొచ్చాయి. మొదటి అవార్డ్‌ వచ్చినప్పుడు అంతగా ఎగ్జైట్‌ కాలేదు. ఈ అవార్డ్‌తో అనౌన్స్‌ చెయ్యగానే ఏదో గౌరవంగా, బాధ్యత మరింత పెరిగినట్లుగా అనిపించింది. ఆ రోజు ‘తన వెడ్స్‌ మనూ`2’ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. నాన్న ఫొన్‌ చేసి నేషనల్‌ అవార్డ్‌ ట్రోఫీ గురించి చెప్పి, ఈ పుట్టినరోజు నీకు చాలా స్పెషల్‌ అన్నారు(ఆ రోజు కంగనా పుట్టినరోజు). ఒక్క క్షణం నేను నమ్మలేకపోయాను. మంచి నటి అనిపించుకోవడం గొప్ప విషయం. నా మొదటి సినిమా ‘గ్యాంగ్‌స్టర్‌’తోనే నాది ఫవర్‌ హౌస్‌ టాలెండ్‌ అని అందరూ అన్నారు. అటువంటి గుర్తింపు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. అవార్డ్‌ అనేది బూస్ట్‌ లాంటిది. నంబర్‌ గేమింగ్‌ అంటే నాకు నచ్చదు. వాటి గురించి అసలు పట్టించుకోను’’ అని చెప్పుకొచ్చింది.

‘ఫ్యాషన్‌’ సినిమా నుంచి ప్రియాంక చోప్రాకు, నాకు మంచి స్నేహం ఉంది. ‘మేరీకోమ్‌’ సినిమాకు తప్పకుండా ప్రియాంకాకు అవార్డ్‌ వస్తుందని ఊహించా. కానీ తనకు కాకుండా హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌ కేటగిరీలో రావడం చూసి షాక్‌ అయ్యా. మేరీకోమ్‌లో తను నటనకు మనకున్న అవార్డ్‌లన్నీ ఆమెకు రావాల్సిందే. ఇదే విషయం తనకు కాల్‌ చేసి మాట్లాడాను అని తెలిపింది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs