Advertisement
Google Ads BL

మృత్యుంజయ హోమం విజయవంతం..!


ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు అనారోగ్య కారణాలతో అకాల మృత్యువుకు గురి కావడం అందర్నీ బాధిస్తున్న విషయం. ఇంతమంది అకాల మరణం చెందడం దుష్టశక్తి ప్రభావమని కొందరు పెద్దలు భావిస్తున్నారు. ఈ విషయమై రాజమండ్రిలో వేదపండితుల్ని సంప్రదించగా 'అమృత పాశుపత మహా మృత్యుంజయ హోమం' జరిపిస్తే జరుగుతున్న అరిష్టాలు ఆగుతాయని, శాంతి కలుగుతుందని సూచించారు. అందరి మంచిని ఆకాంక్షిస్తూ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈ హోమం చేస్తే యావత్ చిత్ర పరిశ్రమకు మంచి జరుగునని నిర్ణయం తీసుకోవడమైనది. దీనికి విశాఖ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాహాస్వామి ఈ హోమం జరిపించడానికి అంగీకరించారు. దీంతో మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు 'శాంతి హోమం' జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళీమోహన్ శుక్రవారం(మార్చి 13) న ఫిలింనగర్ దైవ సన్నిధిలో తెలిపారు. ఈ హోమం మార్చి 23 నుండి 25 వరకు ఫిలిం నగర్ దేవాలయంలో జరిపారు. మార్చి 25న జరిగిన పసుపత మృత్యుంజయ యాగం పూర్ణాహుతికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల కారణంగా సినీ పెద్దలందరూ కలిసి ఈ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ హోమాన్ని జరిపించడం శుభపరిణామం. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే సినీకళాకారుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు" అని తెలిపారు.

Advertisement
CJ Advs

మురళీమోహన్ మాట్లాడుతూ "ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మనిఖ్యాలరావు గారికి, కృష్ణం రాజుకి, కృష్ణకి అందరికి పేరుపేరునా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంతో ఇకపై నష్టాలు జరగకుండా ఉంటాయని భావిస్తున్నాను" అని అన్నారు.

 సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ "మూడో రోజున జరిగిన ఈ పూర్ణహుతిలో పాల్గొన్న అందరికి శక్తి లభిస్తుంది. సినీ పరిశ్రమ చక్కగా వర్ధిల్లాలి" అని అన్నారు.

కృష్ణ మాట్లాడుతూ "చాలా మంది సినీకళాకారులు దూరం అయిపోయారు. ఇంతమంది ఒకేసారి దూరం అవడం ఎప్పుడు జరగలేదు. ఈ మరణాలు ఆగడానికి మురళీమోహన్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. సినీకళాకారుల శ్రేయస్సును కోరుకునే ఆయనకు నా ధన్యవాదాలు" అని తెలిపారు.

కృష్ణంరాజు మాట్లాడుతూ "శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ప్రత్యక్షంగా ఈ యాగాన్ని జరిపించడం సంతోషకరమైన విషయం. ఎందరో మహానుభావులు వచ్చి ఈ యాగాన్ని జరిపించి విజయవంతం చేసారు" అని అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ "మూడు రోజులుగా రోజుకు 9 గంటల చొప్పున అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిష్టగా పూర్తి చేసాం. సినీపరిశ్రమ బాగు కోసం మురళీమోహన్ గారు ఎంతో నిష్టగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు" అని చెప్పారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs