అగ్ర కథానాయిక అనుష్క టైటిల్ రోల్ లో గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకనిర్మాతగా రూపొందుతోన్న తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి’. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలో మూడు సాంగ్స్ ఆవిష్కరణ కార్యక్రమం మార్చి 21న, శనివారం వైజాగ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు సహా హీరోయిన్ అనుష్క, గుణశేఖర్, రానా, పరుచూరి బ్రదర్స్, హాంసానందిని సహా చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఆడియో సీడీలను రానా, అనుష్క ఆవిష్కరించి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రడుకి అందజేశారు. ఈ నేపథ్యంలో...
మినిష్టర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ‘‘గుణశేఖర్ మా వైజాగ్ లోని నర్సీపట్నంకి చెందినవాడు. సినిమాల్లో మంచి దర్శకుడవుతాడని మాకు తెలుసు. అయితే ఇంత పెద్ద సినిమాని తీస్తాడని అనుకోలేదు. రుద్రమదేవిగా అనుష్క, అల్లుఅర్జున్, రానాలు చేస్తున్న ఈ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. ఇంత పెద్ద ఛాలెంజింగ్ రోల్ చేసిన గుణశేఖర్ ను అభినందిస్తున్నాను. అనుష్క ఏ పాత్ర చేసినా అందులో ఇమిడిపోతుంది. ఈ రుద్రమదేవి చరిత్రలో నిలిచిపోతుంది’’ అన్నారు.
మినిష్టర్ గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘భవిష్యత్ లో వైజాగ్ సినీ పరిశ్రమకి కేంద్రబిందువుగా మారుతుంది. గుణశేఖర్ సినిమాలన్నీ కమర్షియల్ సక్సెస్ నే కాకుండా మంచి పేరుని అవార్డులను తీసుకొచ్చాయి. చిరంజీవిగారితో చూడాలని ఉంది, మహేష్ తో ఒక్కడు, బాలరామాయణం వంటి సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఏవీ చూస్తుంటే రుద్రమదేవి మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. అనుష్క, బన్ని, రానాలకు అభినందనలు’’ అన్నారు.
రానా మాట్లాడుతూ ‘‘రుద్రమదేవి సినిమాలో అనుష్కనే హీరో. గుణశేఖర్ గారు నాకు 7 సంవత్సరాలుగా తెలుసు. నేను యాక్టర్ కాకముందు నుండే ఆయనతో పరిచయం ఉంది. ఈ చిత్రంతో అద్భుతమైన హిస్టరీ సినిమాని ఆవిష్కరించారు. నా చుట్టూ సినిమాయే ప్రపంచంగా ఉండేది. కృష్ణుడంటే ఎన్టీఆర్ గారు, రాముడంటే సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబుగారు, అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణగారు ఇలా నా మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. ఇక నాకు ఇష్టమైన ఇళయరాజా సంగీతంలో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది’’అన్నారు.
ఇళయరాజా(ఏవీ ద్వారా) మాట్లాడుతూ ‘‘ఇండియాలోనే ఫస్ట్ హిస్టారికల్ త్రీడి ఫిలిమ్. ప్రస్తుతం సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ జరుగుతుంది. ఈ సినిమాకి లండన్ కి చెందిన సింఫనీ టీమ్ పనిచేస్తుంది. యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
గుణశేఖర్ మాట్లాడుతూ ‘‘నేను డైరెక్టర్ కంటే మంచి సినిమా ప్రేమికుడిని. వైజాగ్ నుండి వచ్చినట్లు చాలా మందిలాగానే నేను కూడా చెన్నైకి వచ్చాను. ఈ రోజు దర్శకుడిగా, నిర్మాతగా ఈ సినిమా చేశాను. ఈ సినిమా కోసం అనుష్క చాలా కష్టపడిరది. కత్తిసాము, గుర్రపుస్వారీ వంటి వాటిని కష్టపడి నేర్చుకుంది. మహేష్, ఎన్టీఆర్, బన్ని, రానా వంటి హీరోల లెవల్ లో ఈ సినిమా కోసం కష్టపడిరది. రానా హీమాన్ లా కనిపించాడు. ఈ సినిమాలో మంచి రొమాంటిక్ యాంగిల్ ఉన్న హీరోలా కనిపిస్తాడు. అలాగే బన్ని ఈ సినిమాలో గోనగన్నారెడ్డి చిత్రంలో నటించడం చాలా హ్యపీగా అనిపించింది. బన్ని మంచి సినిమా అభిమాని. ఈ సినిమా తీస్తున్నానని మొదటి నుండి నన్ను బాగా ఎంకరేజ్ చేయడమే కాకుండా ఈ సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర చేస్తానని కూడా తనకు తాను ముందుకు రావడం ఆనందంగా ఉంది. బన్ని రొటీన్ సినిమాలను చేయడానికి ఇష్టపడడు. అందుకే రేసుగుర్రం వంటి సినిమా తర్వాత ఏదైనా కొత్తగా చేయాలని ఈ సినిమాని చేశాడు. ఈ సినిమా కోసం, గోనగన్నారెడ్డి పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. బన్నిలోని మాస్ యాంగిల్ ను యూత్ ఫుల్ గా ఈ సినిమాలో చూస్తారు. రాబిన్ హుడ్ లాంటి పాత్ర. ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు ఉన్నట్లు రుద్రమదేవి విజయం వెనుక అల్లుఅర్జున్ ఉన్నాడు. అలాగే ఈ సినిమా సంగీతం కోసం లండన్ సింఫనీ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. అక్కడే రీ రికార్డింగ్ చేస్తున్నాం. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఒక నెల రోజుల పాటు నేను చేసిన రీసెర్చ్ ను చదివి సాంగ్స్ రాశారు. తోటతరణి, నీతాలూల్లా వంటి టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. కాకతీయ సామ్రాజ్యం ఒరిస్సా సరిహద్దు నుండి మహారాష్ట్ర సరిహద్దు వరకు ఉంటుంది. అందుకనే ఈ సినిమా ఆడియోను వైజాగ్ లో ప్లాన్ చేశాం. 70 కోట్ల పెట్టుబడితో అనుకున్న టైమ్ లో ఈ సినిమా చేయడానికి కారణమైన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందరికీ థాంక్స్’’ అన్నారు.
అగ్ర కథానాయిక అనుష్క మాట్లాడుతూ ‘‘ఈ సినిమా క్రెడిట్ అంతా గుణశేఖర్ గారికే చెందుతుంది. అందరూ చాలా గొప్ప టెక్నిషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. వారందరితో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి పెద్ద సినిమాలో నన్ను నమ్మి ఈ రోల్ ను ఇచ్చిన గుణశేఖర్ గారికి థాంక్స్’’ అన్నారు.
వరంగల్‌లో ‘రుద్రమదేవి’ ఆడియో ఫంక్షన్
ఆడియో సీడీలను అల్లుఅర్జున్, అనుష్క విడుదల చేసి తొలి సీడీని కొండా సురేఖ, కొండా మురళిలకు అందజేశారు.
కొండా సురేఖ మాట్లాడుతూ ‘‘పోరాటాలకు మారుపేరైన రుద్రమదేవి చరిత్రను సినిమాగా తెరకెక్కించిన గుణశేఖర్ గారిని అభినందిస్తున్నాను. సినిమాని 2డి, 3డి టెక్నాలజీలో విడుదల చేస్తున్నారు. నేను సినిమా చూసి చాలా కాలమైంది. ఈ సినిమాని చూడాలనుకుంటున్నాను’’ అన్నారు.
తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీకి పూర్తి సహకారం అందిస్తుందని తెలియజేస్తున్నాను. ఈ సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ ‘‘తెలుగుజాతిని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన రుద్రమదేవి చరిత్ర మన హృదయాలనుండి చెరగలేదు. ఎప్పుడో స్కూల్ రోజుల్లో చదువుకున్న రుద్రమదేవి కథను సినిమా తెరకెక్కించాలని కళ కన్న దార్శనికుడు, దర్శకుడు గుణశేఖర్ ను అభినందిస్తున్నాను’’ అన్నారు.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ‘‘గుణశేఖర్, దిల్ రాజు, కృష్ణంరాజు, అనుష్క సహా టీమ్ ను అభినందిస్తున్నాను’’ అన్నారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘అనుష్క చాలా బాగా నటించింది. గోనగాన్నారెడ్డి పాత్రను 30 ఏళ్ల క్రితం సినిమాగా తీయాలనుకున్నాను. ఇప్పుడు గుణశేఖర్ ఆ రోల్ ను ఈ సినిమాలో చూపించాడు. యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
గుణశేఖర్ మాట్లాడుతూ ‘‘నేను ఎనిమిదవ తరగతి నాన్ డిటెయిల్ లో రుద్రమదేవి చరిత్రను చదివి ఇనస్ఫైర్ అయ్యాను. నేను 9 ఏళ్లుగా ఈ సినిమాని తెరకెక్కించాలని ట్రై చేస్తున్నన్నాను. అవతార్ సినిమా చూసి స్టీరియోస్కోపిక్ త్రీడీలో చూపించాలని నిర్ణయించుకున్నాను. ఇది మన తెలుగు వాళ్ల కథ. ప్రపంచంలోని తెలుగువాళ్ల కథ. మార్కోపోలో అనే ఇటాలియన్ టూరిస్ట్ కాకతీయుల గురించి, రుద్రమదేవి పరిపాలన గురించి ప్రస్తావించాడు. అంత ఉత్తేజమైన కథ. రaాన్సీ రాణి, ఎలిజిబెత్ గురించి తెలిసిన మనకు రాణి రుద్రమదేవి గురించి తెలియదు. తెలియజేసే ప్రయత్నమే నాది. 70 కోట్ల బడ్జెట్ తో రుద్రమదేవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. తెలుగువాళ్ల రాణి అని మనం గర్వించేలా ఉంటుంది. నాతో పాటు గుణా టీమ్ వర్క్స్ కలిసి పనిచేశారు. అల్లుఅర్జున్ గోనగన్నారెడ్డి పాత్రను నేను చేస్తానంటూ ముందుకు వచ్చారు. గొప్ప సినిమా ప్రేమికుడు కాబట్టే ఈ పాత్ర చేయడానికి ముందుకు వచ్చాడు. అందు అల్లుఅర్జున్ కి రుణపడ్డాం. అనుష్క ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసింది. రాణి రుద్రమ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు చూస్తుంటే అనుష్కలా ఉంటుందనిపిస్తుంది. జోదా అక్బర్ కథ కంటే రాణి రుద్రమదేవి సినిమా చేయడం నా అదృష్టమని నీతాలూల్లా అన్నారంటే ఆమె ఎంత ఇన్ స్ఫైర్ అయ్యారో తెలుస్తుంది. రుద్రమదేవి అనే సినిమాని నిర్మించడానికి మేమందరం కూళీల్లాగా పనిచేశాం. బన్ని క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాడు. మాస్ యాంగిల్, యూత్ ఫుల్ గా కనపడతాడు’’ అన్నారు.
అనుష్క మాట్లాడుతూ ‘‘షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది నా పుట్టిన ఊరులా మారిపోయింది’’ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ ‘‘అనుష్కను అరుంధతిలో ఎలా చూస్తారో ఈ సినిమాలో అంతకంటే ఎక్కువగా, బాగా కనపడుతుంది. రుద్రమదేవి కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో బన్ని గోనగన్నారెడ్డి పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడని తెలిసింది. చాలా హ్యాపీగా అనిపించింది. గుణశేఖర్, బన్ని, అనుష్క కారణంగా సినిమా పెద్ద రేంజ్ లో తెరకెక్కింది. బన్ని ఎంట్రీతో సినిమా రేంజ్ మారిపోయింది’’ అన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాట్లాడుతూ ‘‘అనుష్కనే ఈ సినిమాకి హీరో. అనుష్క కాబట్టి ఈ సినిమా అయింది. తన వల్లే ఈ సినిమా పూర్తయింది. వేరేవరితో ఈ సినిమా పూర్తి కాదు. కృష్ణంరాజు, రానా సహా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, గొప్ప టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చేస్తానన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ సినిమా చేయడానికి ప్రథమ కారణం నాకు తెలుగు సినిమా అంటే ప్రాణం. నా వల్ల తెలుగు సినిమా ఒక మెట్టు ఎక్కుతుందంటే, నాకు అంత కంటే అదృష్టం ఇంకోటి లేదు. తెలుగు సినిమా మెట్టు ఎక్కితే గర్వపడతాను. మరో కారణం నాకు ఆడవాళ్లంటే కారణం. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ హిస్టారికల్ మూవీ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాడు. కానీ గుణశేఖర్ గారే నిర్మించారు. ఇవాళ సినిమా సెకండ్ అంటూ డబ్బే ఫస్ట్ అంటున్నారు. కానీ గుణశేఖర్ గారికి మాత్రం సినిమాయే ఫస్ట్. ఎప్పుడూ సినిమా కోసమే నిలిచారు. సినిమాపై ప్యాషన్ ఉన్న దర్శకుడు. అంతటి ఫ్యాషనేట్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. ఈ సినిమా ఆయన కోసమే విజయం సాధించాలి. మనం ఎక్కడి నుండి వచ్చాం. ఎవరి వల్ల వచ్చాం. మనం ఎక్కడికి వెళ్లినా ఆ హిస్టరీని మరిచిపోకూడదు. నాకు ఓ హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ పేరు మెగాస్టార్ చిరంజీవిగారు. ఆయన ఎండలో కష్టపడితే ఆయన నీడ నుండి మేం పైకొచ్చాం. నాకు ఎవరైనా చిరంజీవిగారి తర్వాతే. ఎవరినైనా హర్ట్ చేయడం చాలా ఈజీ, వాళ్ల హార్ట్ లోకి వెళ్లడం చాలా కష్టం బన్ని అని చిరంజీవిగారు ఒకసారి నాతో అన్నారు. నన్ను ఇన్ని మెట్లు ఎక్కించిన మెగాభిమానులకు ధన్యవాదాలు’’ అన్నారు.