సతీష్‌బాబు, మెరీనా, ప్రియాంక, సురేష్ ప్రధాన పాత్రల్లో రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజు కుంపట్ల దర్శకత్వంలో జనార్థన్ మందమూల నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్ మాధాపూర్‌లోని జయభేరి క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ బిగ్ సిడి.ని ఆవిష్కరించడంతోపాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా లాంచ్ చేశారు. మరో ముఖ్యఅతిథి స్వామిగౌడ్ ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌కు అందించారు. జాన్‌పోట్ల సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో హేమాస్ మీడియా ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇంకా ఈ కార్యక్రమంలో కె.ఎం.రాధాకృష్ణన్, మల్కాపురం శివకుమార్, హేమాస్ మీడియా అధినేత కె.సురేష్‌బాబు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ కొడాలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
వి.వి.వినాయక్: ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న సతీష్‌బాబు మా ఊరివాడే. సినిమా ప్యాషన్ వున్న వ్యక్తి. మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలన్న తపన వున్నవాడు. ఈ సినిమాతో అతను హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు హ్యాపీగా వుంది. ఈ సినిమా గురించి నాకు తెలుసు. దర్శకనిర్మాతలు ఎంతో కష్టపడి ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయి వారి కష్టానికి ఫలితం లభించాలని కోరుకుంటున్నాను.
స్వామిగౌడ్: సినిమాలంటే ఇష్టపడనివారు వుండరు. అందరూ ఇష్టపడతారు. అయితే నాకు సినిమాల గురించి అంతగా తెలియదు. సినిమాల్లో హీరోలుగా, హీరోయిన్లు పేరు తెచ్చుకోవాలని చిత్ర పరిశ్రమకు ఎంతో మంది వస్తుంటారు. అయితే అందరికీ ఆ అదృష్టం దక్కదు. అలాంటివారు ఎన్నో కష్టాలు పడుతుంటారు. వారి కోసం తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
జనార్థన్ మందమూల: మా డైరెక్టర్ రాజు చెప్పిన కథను హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్‌మీద చూపించాడు. కథ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. ఈ సినిమా అనుకున్న టైమ్‌కి కంప్లీట్ చెయ్యగలిగాం. అది మా మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాం. దీనికి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో బాగా సహకరించారు. జాన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.
రాజు కుంపట్ల: అందర్నీ ఎంటర్‌టైన్ చేసే మంచి కథ ఇది. మా నిర్మాత సపోర్ట్‌తో అనుకున్న షెడ్యూల్‌లో కంప్లీట్ చెయ్యగలిగాం. అలాగే యూనిట్‌లోని ప్రతి ఒక్కరి సపోర్ట్ వుంది. జాన్ చాలా ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు తప్పకుండా మీకు నచ్చుతాయి.
జాన్ పోట్ల: పాటలు చాలా బాగున్నాయని అందరూ అంటున్నారు. నాకు చాలా సంతోషంగా వుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజువల్‌గా కూడా పాటలు చాలా బాగా తీశారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందర్నీ ఆకట్టుకునేలా మా డైరెక్టర్ రాజ్‌గారు ఈ చిత్రాన్ని రూపొందించారు.
సతీష్‌బాబు, మెరీనా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక, ధన్‌రాజ్, చలాకీ చంటి, తాగుబోతు ఫణి, మహేష్, జెన్నీఫర్, ఉమ, హసీనా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జాన్ పోట్ల, సినిమాటోగ్రఫీ: మురళి, పాటలు: సురేష్ గంగుల, బాలకృష్ణ కె. ఎడిటింగ్: క్రాంతి, సహనిర్మాత: సుదర్శనరావు సరికొండ, నిర్మాత: జనార్థన్ మందమూల, దర్శకత్వం: రాజు కుంపట్ల.