Advertisement
Google Ads BL

మణిరత్నం సినిమా తెలుగులో ‘ఓకే బంగారం’


ఎన్నో ప్రేమ కావ్యాలను ఎంతో హృద్యంగా చిత్రీకరించడంలో సిద్ధహస్తుడుగా పేరు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు మణిరత్నం లేటెస్ట్‌ లవ్‌ ట్రీట్‌ ‘ఓ కాదల్‌ కన్మణి’. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, నిత్య మీనన్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఓకే బంగారం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. మద్రాస్‌ టాకీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకాలపై ఈ చిత్రం తెలుగులో రిలీజ్‌ అవుతుంది. ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు శుక్రవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు దిల్‌రాజు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

దిల్‌రాజు: 15 సంవత్సరాల క్రితం మేం డిస్ట్రిబ్యూటర్స్‌గా వున్నప్పుడు మణిరత్నంగారి ‘సఖి’ చిత్రాన్ని నైజాంలో రిలీజ్‌ చేశాం. ఆ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ‘సఖి’లాంటి సినిమా మణిరత్నంగారు తీస్తున్నారని తెలిసి 15 సంవత్సరాల తర్వాత ఈ సినిమా తెలుగు రైట్స్‌ కోసం ఆయన్ని కలవడం జరిగింది. జనరల్‌గా డబ్బింగ్‌ సినిమాలకు, రీమేక్‌లకు దూరంగా వుంటాను. ఎక్స్‌ట్రార్డినరీగా నాకు కనెక్ట్‌ అయితే కానీ డబ్బింగ్‌ సినిమా చెయ్యను. ఈ సినిమా కంటెంట్‌ గురించి తెలుసుకున్న తర్వాత సఖి తర్వాత వస్తున్న మరో క్యూట్‌ లవ్‌స్టోరీ ఇది అనిపించింది. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకొని ఇంట్లో చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకొని కలిసి వుండే స్టోరీతో చేసిన సినిమా ‘సఖి’. ఈ సినిమా విషయానికి వస్తే ఒక అమ్మాయి, అబ్బాయి బాంబేలో కలుసుకుంటారు. వాళ్ళిద్దరూ అబ్రాడ్‌ వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళడానికి కొంత టైమ్‌ వుంటుంది. ఈ టైమ్‌లో వాళ్ళిద్దరి మధ్య ఎట్రాక్షన్‌ ఏర్పడుతుంది. అబ్రాడ్‌ వెళ్ళే వరకు ఇద్దరూ కలిసి వుండాలని నిర్ణయించుకుంటారు. అలా ఒకే ఇంట్లో లివింగ్‌ టుగెదర్‌గా వుంటూ వుంటారు. వాళ్ళు అబ్రాడ్‌ వెళ్ళే టైమ్‌కి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిరదా లేక ఎవరికి వారు వాళ్ల గమ్యస్థానాలకు చేరుకున్నారా? అనేది కథ. సింపుల్‌ కథ అయినప్పటికీ సీన్స్‌ చాలా క్యూట్‌గా చేశారు. నేను ఒక థియేట్రికల్‌ ట్రైలర్‌ చూశాను. చాలా బాగుంది. ఇప్పటికే తమిళ్‌ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారని తెలిసింది. ఇలాంటి క్యూట్‌ సినిమాని, కంటెంట్‌ వున్న సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతో ‘ఓకే బంగారం’గా తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాం. ఈనెలాఖరుకు ఆడియో రిలీజ్‌ చేసి ఏప్రిల్‌ రెండోవారంలోగానీ, మూడో వారంలోగానీ  తెలుగు వెర్షన్‌ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యాలని అనుకుంటున్నాం. ఈ సినిమాలో మమ్ముట్టిగారి అబ్బాయి దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇక నిత్యమీనన్‌ సంగతి తెలిసిందే. సెలెక్టివ్‌గా సినిమాలు చేసే నిత్య ఈ సినిమాకి బాగా ప్లస్‌ అవుతుంది. బెంగుళూరు డేస్‌ చిత్రాన్ని మలయాళంలో రీమేక్‌ చెయ్యబోతున్నాం. దుల్కర్‌ సల్మాన్‌ అందులో హీరో. ‘ఓకే బంగారం’ విషయానికి వస్తే ఈ సినిమాకి అందరూ టాప్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి మరో విశేషమేమిటంటే తెలుగు వెర్షన్‌లో హీరోకి మన నాని డబ్బింగ్‌ చెప్పాడు. మణిరత్నంగారు అడగ్గానే వెంటనే వెళ్ళి డబ్బింగ్‌ పూర్తి చేశాడు. నాని డబ్బింగ్‌ చెప్పడం సినిమాకి చాలా ప్లస్‌ అయింది. ఈ సందర్భంగా మా తరఫున, మణిరత్నంగారి తరఫున నానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

దుల్కర్‌ సల్మాన్‌, నిత్యమీనన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్‌, ఎడిటింగ్‌: శ్రీకరప్రసాద్‌, కో`ప్రొడ్యూసర్స్‌: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌రాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణిరత్నం. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs