Advertisement
Google Ads BL

‘ఉత్తమ విలన్‌’ టీజర్‌ లాంచ్‌


‘దశావతారం’, ‘విశ్వరూపం’ వంటి విభిన్న చిత్రాలతో సంచలనం సృష్టించిన జాతీయ నటుడు కమల్‌హాసన్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘ఉత్తమ విలన్‌’. ఈ చిత్రం టీజర్‌ లాంచ్‌ గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో కమల్‌హాసన్‌, నిర్మాత సి.కళ్యాణ్‌, దర్శకుడు రమేష్‌ అరవింద్‌, కోప్రొడ్యూసర్‌ సి.వి.రావు, కుమార్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

సి.కళ్యాణ్‌: ఈ సినిమా తమిళ్‌లో ఆడియో ఫంక్షన్‌ జరిగినపుడు నేను ఫారిన్‌ వెళ్తున్నాను. ఒక మంచి ఫంక్షన్‌ మిస్‌ అవుతున్నానే అనుకుంటూనే వెళ్ళాను. కమల్‌హాసన్‌గారు ఏ సినిమా తీసిన అందులో ఒక ప్రయోగం వుంటుంది. దానికి తగ్గ ఫలితం ఆశించే ఆ సినిమా చేస్తారు. అది డబ్బు రూపంలో కాదు, పేరు రూపంలో రావాలని కోరుకుంటారు. శ్రమకు తగిన ఫలితం రావాలని కోరుకునే వ్యక్తుల్లో ఆయన మొదటివారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి కమల్‌గారు సినిమా చేసే అవకాశం లేదు. కానీ, కమల్‌గారి సినిమాకి ప్రొడ్యూసర్‌ని అవ్వాలన్న తాపత్రయంతో 53 సినిమాలు చేసిన తర్వాత 54వ సినిమా కమల్‌గారి సినిమాకి ప్రొడ్యూసర్‌ని అయ్యాను. తెలుగు రైట్స్‌ విషయంలో ఎంతో గట్టి పోటీ వున్నప్పటికీ ఈ సినిమాని నాకు ఇచ్చినందుకు కమల్‌గారికి, లింగుస్వామిగారికి థాంక్స్‌ చెప్తున్నాను. ఈ సినిమాకి నేను కూడా ఒక పార్ట్‌ అయినందుకు ఆనందంగా వుంది. 

రమేష్‌ అరవింద్‌: ఈ సినిమాకి మేం రెండు యజ్ఞాలు చేశాం. ఒకటి 8వ సెంచరీలో జరుగుతుంది. అందులో కమల్‌గారు ఒక నృత్య కళకారుడిగా కనిపిస్తారు. మరో కథ 21వ సెంచరీలో జరుగుతుంది. ఈ కథలో ఆయన ఒక సూపర్‌స్టార్‌. ఒకటి కామెడీ స్టోరీ, మరొకటి ఫ్యామిలీ డ్రామా. ఈ రెండిరటినీ ఎలా మింగిల్‌ చేశామన్నది కమల్‌గారి ఇంటెలిజెన్స్‌ స్క్రీన్‌ప్లేతో స్క్రీన్‌ మీద చూడొచ్చు. కమల్‌గారి సినిమాలంటే కేవలం ఒక ప్రాంతానికి చెందిన వారు మాత్రమే చూడరు. భారతదేశం మొత్తం ఆయన చేసే సినిమా కోసం ఎదురుచూస్తారు. ఎందుకంటే ఆయన సినిమాలో ఏదో ఒక కొత్త మ్యాజిక్‌ వుంటుందన్న నమ్మకం వారికి వుంటుంది. ఎవరైనా ఒక మంచి సినిమా చేస్తే దాని తర్వాత చెయ్యబోయే సినిమా ఒక స్టెప్‌ ఎక్కువగా వుండాలని ఆశపడతారు. కానీ, కమల్‌గారు అలా కాదు. తను నెక్స్‌ట్‌ చేయబోయే సినిమా ఒక స్టెప్‌ కాదు, ఒక స్టెయిర్‌కేసే పైన వుండాలని కోరుకుంటారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ గురించి చెప్పాలంటే మన మహాభారతంలో ఒక హీరోయిన్‌ వుంటే పంచ పాండవులు హీరోలుగా వుంటారు. కానీ, ఈ సినిమాలో దానికి రివర్స్‌లో కమల్‌గారికి ఐదుగురు హీరోయిన్లు వుంటారు. ఇందులో మనం రియల్‌ లైఫ్‌లో చూసే రియల్‌ క్యారెక్టర్స్‌ కనిపిస్తారు. ఈ సినిమాకి ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ వున్న టెక్నీషియన్స్‌ వర్క్‌ చేశారు. కాబట్టి మీ అందరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి. 

కమల్‌హాసన్‌: ఈ సినిమాలో రెగ్యులర్‌గా వుండే బ్లడీ ఫైట్స్‌ లేవు. కార్లు పల్టీలు కొట్టడం లాంటి వుండవు. కానీ, ఈ సినిమా చూస్తే మీ మనసు అలా పల్టీలు కొడుతుంది. ఒక్కొక్క సీన్‌ చేస్తున్నప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నామన్న ఫీలింగ్‌ మాకు కలిగింది. కానీ, సినిమా పూర్తయిన తర్వాత ఇది మంచి సినిమాయే కాదు, మంచి కమర్షియల్‌ సినిమా కూడా అనిపించింది. ఇందులో ఫెంటాస్టిక్‌ యాక్టింగ్‌ టాలెంట్‌ వుంది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినవాళ్ళు కూడా చాలా బాగా చేశారు. మళ్ళీ బాలచందర్‌గారి సినిమా చూసినట్టు అనిపిస్తోందని అందరూ చెప్పారు. మాకు అంతకంటే గొప్ప అవార్డు లేదని అనుకుంటున్నాను.  నేను చేసిన మరోచరిత్ర సినిమా వచ్చినపుడు ఒక చిన్న సినిమాగా వచ్చింది. ఆ తర్వాత చాలా పెద్ద సినిమా అయింది. అలాగే ఈ సినిమా కూడా మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాకి జిబ్రాన్‌ చాలా మంచి మ్యూజిక్‌ చేశాడు. ఆల్రెడీ తమిళ్‌లో చార్ట్‌ బస్టర్స్‌లో టాప్‌లో వుంది ఈ ఆడియో. తెలుగులో ఈనెల 28న ఆడియో రిలీజ్‌ వుంది. 

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కమల్‌హాసన్‌ సమాధానమిస్తూ...

ఈ సినిమా చేసే ముందు, చేసిన తర్వాత మీరు ఎలా ఎక్సైట్‌ అయ్యారు?

నేను, రమేష్‌ మంచి ఫ్రెండ్స్‌. సినిమా ఎలా వుంటుందోనన్న సందేహం లేకుండా చేశాం. అలాగే మేమిద్దరం కె.బాలచందర్‌ అనే ఇన్‌స్టిట్యూట్‌ నుంచి వచ్చాం. ఈ సినిమాలో బాలచందర్‌గారు చేయడానికి ఒప్పుకున్నప్పుడు చాలా ఎక్సైట్‌ అయ్యాను. అలాగే మ్యూజిక్‌లోగానీ, స్క్రీన్‌ప్లేలోగానీ అన్ని విషయాల్లో ఎక్సైట్‌మెంట్‌ వుంది. 

విశ్వరూపం చిత్రాన్ని టీవీల్లో రిలీజ్‌ చేసి ఒక ప్రయోగం చేశారు. ఈ సినిమాకి అలాంటిది ఏమైనా చెయ్యబోతున్నారా?

అలాంటిది ఏమీ చెయ్యడం లేదు. అందరూ బిగ్‌ స్క్రీన్‌ మీదే చూడాలన్న ఉద్దేశంతో థియేటర్స్‌లోనే రిలీజ్‌ చేస్తున్నాం. తెలుగులో మాకు లక్కీగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ కళ్యాణ్‌గారు దొరికారు. నేను చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. ఆయన ఈ సినిమాకి చివరిలో వచ్చి జాయిన్‌ అయ్యాను అన్నారు. కానీ, చివరిలో వచ్చేవారే ఆడియన్స్‌. వాళ్ళు లేకుండా సినిమాయే లేదు. నా సినిమా చెయ్యాలని కళ్యాణ్‌గారు రావడం హ్యాపీగా వుంది. ఇది ఒక బిజినెస్‌ లాంటిది కాదు. 

ఈ సినిమాని మీరు డైరెక్ట్‌ చెయ్యకపోవడానికి రీజన్‌?

పోస్టర్‌ మీద వున్న నా ఫోటో చూస్తే అంత మేకప్‌ చేసుకొని డైరెక్షన్‌ కూడా చెయ్యాలంటే ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది. ఇందులో నటించిన ఆర్టిస్టుల్ని చూసినా మీకు తెలుస్తుంది. అందుకే రమేష్‌ డైరెక్ట్‌ చేశారు, నేను అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాను. 

ఆన్‌ లొకేషన్‌లో కథలో మార్పులు ఏమైనా చేశారా?

ఛేంజెస్‌ ఏమీ చెయ్యలేదు. ప్రింట్‌ చేసిన స్క్రిప్ట్‌తో షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. బాలచందర్‌గారు అక్కడక్కడా మార్పులు చెప్పినా అలా ఎందుకు వుందో ఆయనకి చెప్తే ఓకే అనేవారు. 

ఉత్తమ విలన్‌ అనే టైటిల్‌ పెట్టడానికి కారణం?

విలన్‌ అనేది ఒక పాయింట్‌ ఆఫ్‌ వ్యూ. మండోదరి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో రావణుడే హీరో. ఈ లోకంలో పెద్ద హీరో ఎవరంటే మా నాన్నగారే అంటారు ఇంద్రజిత్‌, మావారే అంటారు మండోదరి. ఈ సినిమాకి ఉత్తమ విలన్‌ అనే టైటిల్‌ ఎందుకు పెట్టామో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది అన్నారు కమల్‌హాసన్‌. 

కమల్‌హాసన్‌, జయరామ్‌, కె.బాలచందర్‌, నాజర్‌, ఆండ్రియా, పూజా కుమార్‌, పార్వతి మీనన్‌,  పార్వతి నాయర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: కమల్‌హాసన్‌, సంగీతం: ఎం.గిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌, ఎడిటింగ్‌: విజయశంకర్‌, సమర్పణ: తిరుపతి బ్రదర్స్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, కో`ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, నిర్మాత: సి.కళ్యాణ్‌, దర్శకత్వం: రమేష్‌ అరవింద్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs