Advertisement

రామ్ చరణ్, శ్రీను వైట్ల చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం


విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ  నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఈ రోజు (మార్చి 16)  నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. 

Advertisement

ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని  ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో,  అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

 నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ నేటి నుంచి హైదరాబాద్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు."నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు   జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.  

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్, లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ, ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్. సమర్పణ : డి. పార్వతి, నిర్మాత : దానయ్య డి.వి.వి., మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీను వైట్ల

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement