భారతదేశ క్రికెట్ రంగంలో గర్వించదగ్గ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ మెట్టమెదటి సారిగా నటుడిగా వెండితెరపై నటించిన చిత్రం సచిన్- టెండూల్కర్ కాదు. ప్రముఖ సీనియర్ నటి సుహసిని మణిరత్నం కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. సుభాష్ ప్రొడక్షన్స్ పతాకంపై, తాయికొండ వెంకటేష్ నిర్మాతగా, ఎస్.మోహన్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం కన్నడలో ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. తెలుగులో దర్శకరత్న దాసరినారాయణ గారి చేతుల మీదుగా ఇటీవలే ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 13 న తెలుగు లో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత తాయికొండ వెంకటేష్ మాట్లాడుతూ.. భారతదేశ క్రికెట్ రంగంలో గర్వించదగ్గ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ మొట్టమెదటి సారిగా నటుడిగా వెండితెరపై నటించిన చిత్రం సచిన్- టెండూల్కర్ కాదు. ప్రముఖ సీనియర్ నటి సుహాసిని మణిరత్నం కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. సుహాసిని గారు చాలా రోజుల తరువాత పాత్ర నచ్చి అద్భుతంగా చేశారు. సుహాసిని గారు లేకపోతే ఈ సినిమానే లేదు. కొన్ని సన్నివేశాల్లో కంట తడి పెట్టిస్తారు. సుహాసిని గారు నటించిన అమ్మ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం మళ్లీ అందరికి గుర్తొచ్చేలా ఈ చిత్రం వుందని చూసినవారు చెబుతున్నారు. ఈ చిత్రంతో సుహాసిని గారు అవార్డు రావడం ఖాయమని ధీమాగా చెప్పగలం. క్రికెటర్ గా యావత్ ప్రపంచాన్ని అలరించిన వెంకటేష్ ప్రసాద్ గారు ఈ చిత్రంలో క్రికెట్ కోచ్ గా నటించారు. ఆయన మెదటి చిత్రంలో నటిస్తున్న ఫీలింగ్ అస్సలు రాదు. అంత బాగా నటించారు. ఎస్.మోహన్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం కన్నడలో ఇటీవలే విడుదలలై విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. మంచి కథతో, అంతే మంచి కథనంతో చివరి అరగంటలో ఆధ్యంతం ఉత్కంఠ గా సాగే కథనం ఆకట్టుకుంటుంది. మానవత్వం ఇంకా బ్రతికేవుంది అది బయటకి తీస్తే సాటి వారిని మనిషిగా గుర్తిస్తాం. పక్కవాడి కష్టానికి సాయం చేసే మంచి హృదయం అందరికి వుంటుంది. అది బయట పెడితే ప్రతి ఒక్కరూ ఆనందంగా వుంటారు అనే చక్కటి మంచి సందేశాన్ని అందించారు. దర్శకరత్న దాసరినారాయణ గారి చేతుల మీదుగా ఇటీవలే ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో విడుదల చేసి వెంకటపతి రాజు కి అందించగా, ఆడియో మంచి సక్సస్ సాధించింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 13న తెలుగు లో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రముఖ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం, స్నేహిత్, సుభాషిణి తదితరులు నటించగా.. సంగీతం- రాజేష్ రామ్‌నాథ్, కెమెరా- డి. ప్రసాద్ బాబు, ఎడిటింగ్- శివ్, నిర్మాత- తానికొండ వెంకటేశ్వర్లు, కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం- ఎస్.మెహన్