Advertisement
Google Ads BL

సెన్సార్‌ పూర్తి చేసుకున్న హార్రర్‌ థ్రిల్లర్‌ ‘కాలింగ్‌బెల్‌’


రవివర్మ, కిషోర్‌, సంకీర్త్‌, వ్రితి ఖన్నా ప్రధాన పాత్రల్లో గోల్డెన్‌ టైమ్‌ పిక్చర్స్‌ పతాకంపై పన్నా రాయల్‌ దర్శకత్వలో అనూద్‌ నిర్మిస్తున్న హార్రర్‌ థ్రిల్లర్‌ ‘కాలింగ్‌బెల్‌’. ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పన్నా రాయల్‌ మాట్లాడుతూ  ‘‘ఒక డిఫరెంట్‌ కథాంశంతో హార్రర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మా ‘కాలింగ్‌బెల్‌’ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసించారు. ఒక మంచి చిత్రాన్ని తీశామన్న కాన్ఫిడెన్స్‌ మాకు కూడా వచ్చింది. హార్రర్‌ చిత్రాలకు, థ్రిల్లర్లకు ప్రస్తుతం లభిస్తున్న ఆదరణ అందరికీ తెలిసిందే. ఆ కోవలో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ ‘కాలింగ్‌బెల్‌’ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఇటీవల హీరో శ్రీకాంత్‌గారు రిలీజ్‌ చేసిన టీజర్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈనెల 13న ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ కాబోతోంది. పాటలు కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. ఆద్యంతం ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది’’ అన్నారు. 

నిర్మాత అనూద్‌ మాట్లాడుతూ  ‘‘హార్రర్‌ సినిమా తీసి ప్రేక్షకుల్ని మెప్పించాలంటే ఆ సినిమా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో వుండాలి. ఆ స్టాండర్స్‌ని హండ్రెడ్‌ పర్సెంట్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తూ ఖర్చుకు వెనకాడకుండా అద్భుతమైన క్వాలిటీతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. సెన్సార్‌ సభ్యుల ప్రశంసలు కూడా అందుకున్న మా చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందన్న నమ్మకం మాకు వుంది. హార్రర్‌ సినిమాలో మ్యూజిక్‌కి ఎంతో ప్రాధాన్యత వుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాటలు, రీ`రికార్డింగ్‌ విషయంలో ఎక్కువ కేర్‌ తీసుకున్నాం. ఈ చిత్రంలోని పాటల్ని టాప్‌ సింగర్స్‌ అయిన కార్తీక్‌, బాబా సెహగల్‌, గీతా మాధురి, ప్రణవి, శ్రావణ భార్గవిలతో పాడిరచడం జరిగింది. సుకుమార్‌గారు రీ`రికార్డింగ్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా చేశారు. ఈ చిత్రం ఆడియోను మార్చి 13న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. త్వరలోనే చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. 

జీవా, గాంధీ, చంటి, శంకర్‌, వేణు, మమతా రాహుల్‌ మిగతా పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుకుమార్‌ పి., సినిమాటోగ్రఫీ: వివేక్‌ యస్‌.కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: షాని సోలోమన్‌, నిర్మాత: అనూద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs