Advertisement
Google Ads BL

‘క్యూ’ మూవీ ఆడియో లాంచ్‌


నీరజ్‌ శ్యామ్‌, నేహ సక్సేనా జంటగా ఎస్‌.ఎస్‌.నందా వి. సమర్పణలో గణేష్‌ క్రియేషన్స్‌ పతాకంపై సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో లండన్‌ గణేష్‌ నిర్మించిన హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ ‘క్యూ’.. ప్రేమకు.. చావుకు. ఈ చిత్రం మార్చి 14న విడుదల కాబోతోంది. కాగా, ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మార్చి 7న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ తలసాని శ్రీనివాసయాదవ్‌ ఈ చిత్రం ఆడియోను ఈ ఉదయం ఆవిష్కరించారు. ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన ఆడియో ఫంక్షన్‌లో విచ్చేసిన అతిథులు ఆడియోను విడుదల చేశారు. చిత్ర దర్శకుడు సంజీవ్‌ మేగోటి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో కాఫీ మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ కార్యక్రమానికి ఆర్‌.పి.పట్నాయక్‌, యం.యం.శ్రీలేఖ, డా॥ బంటి అతిథులుగా హాజరయ్యారు. ఇంకా 

Advertisement
CJ Advs

హీరో నీరజ్‌ శ్యామ్‌, హీరోయిన్‌ నేహా సక్సేనా, ధన్‌రాజ్‌, చిత్ర సమర్పకులు ఎస్‌.ఎస్‌. నందా వి., నిర్మాత లండన్‌ గణేష్‌, దర్శకుడు సంజీవ్‌ మేగోటి, దేవిశ్రీప్రభు, రాధాకృష్ణ, డా॥ వడ్డేపల్లి కృష్ణ, కరాటే రాజు, లండన్‌ గణేష్‌ తండ్రి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

యం.యం.శ్రీలేఖ: నేను చాలా సార్లు లండన్‌ వెళ్ళాను. అక్కడ గణేష్‌గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఒకరకంగా ఆయన అక్కడ కింగ్‌. ఇప్పుడు తెలుగులో ఓ చిత్రంతో నిర్మాతగా మనముందుకు వస్తున్నారు. నిర్మాతగా కూడా ఆయన కింగ్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.

ఆర్‌.పి.పట్నాయక్‌: ఇది ఒక ఫ్యాక్ట్‌ వున్న కథ. దాన్ని సంజీవ్‌గారు ఎలా చూపిస్తారో అని నేను కూడా ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా ఓపెనింగ్‌కి నేను వెళ్ళాను. కానీ, ఇది ఇలాంటి హార్రర్‌ మూవీ అని నాకు తెలీదు. పాటలు చాలా బాగున్నాయి, టీజర్స్‌ కూడా బాగున్నాయి. ప్రస్తుతం ఇలాంటి సినిమాల ట్రెండే నడుస్తోంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.

డా॥ బంటి: ఈ టీమ్‌ చాలా ఎక్సైటెడ్‌గా వుంది. హీరో, హీరోయిన్‌ చాలా క్యూట్‌గా వున్నారు. లండన్‌ గణేష్‌గారు ఏ పనిచేసినా సక్సెస్‌ఫుల్‌గా చేస్తారు. అలాగే ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్‌ అయి ఇంకా మంచి సినిమాలు తియ్యాలని కోరుకుంటున్నాను.

సంజీవ్‌ మేగోటి: 20 ఏళ్ళ క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. ఈ ఇరవై ఏళ్ళలో నేను 7 తెలుగు సినిమాలు చేశాను. 2005లో వచ్చిన పౌరుషం నా చివరి సినిమా. ఆ తర్వాత కన్నడలో చాలా బిజీ అయ్యాను. ‘క్యూ’తో గణేష్‌గారు నన్ను మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో 25 రోజుల్లో కంప్లీట్‌ చేశాం. గణేష్‌గారి పక్కా ప్లానింగ్‌తో అనుకున్న టైమ్‌లో షూటింగ్‌ ఫినిష్‌ చేశాం. ఈ సినిమాలో ధన్‌రాజ్‌ది చాలా ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌. అతను లేకపోతే ఆ క్యారెక్టరే లేదు. అంతబాగా ఎంటర్‌టైన్‌ చేసే క్యారెక్టర్‌. మీ అందరికీ తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. 

ధన్‌రాజ్‌: ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా. ఈ సినిమాలోని ఓ ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ నాకోసమే రాశానని, నేను తప్పితే ఎవరూ ఆ క్యారెక్టర్‌ చెయ్యలేరని సంజీవ్‌ చెప్పినపుడు నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. నిజానికి ఇలాంటి క్యారెక్టర్‌ ఇంతకుముందు చెయ్యలేదు. అందర్నీ ఎంటర్‌టైన్‌ చేసే క్యారెక్టర్‌. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మీ అందరూ ఈ సినిమా చూసి పెద్ద సక్సెస్‌ చేస్తారని ఆశిస్తున్నాను.

లండన్‌ గణేష్‌: కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది నా నమ్మకం. లండన్‌లో వుంటున్న నాకు ఒక మంచి సినిమా తియ్యాలన్న ప్యాషన్‌ వుంది. దానికి మా యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించారు. ఒక మంచి సినిమాని తీశామన్న తృప్తి మాకు కలిగింది. ‘క్యూ’ చిత్రాన్ని సంజీవ్‌ చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా తప్పకుండా మా అందరికీ మంచి పేరు తెస్తుంది. ఈ సినిమా తర్వాత మా బేనర్‌లో ‘పడమటి సంధ్యారాగం’ అనే సినిమా చేస్తున్నాం. ఆ సినిమా 95 శాతం షూటింగ్‌ పూర్తయింది. 

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: హరీష్‌ ఎస్‌.ఎన్‌., ఫైట్స్‌: శివ, డాన్స్‌: కిరణ్‌ రేలంగి, అజయ్‌, శివశంకర్‌, ఎడిటింగ్‌: అనుగోజు రేణుకాబాబు, సహనిర్మాతలు: బ్రహ్మేశ్వర్‌ సింగు, బోయపాటి హనుమంతరావు, నిర్మాత: లండన్‌ గణేష్‌, కథ, మాటలు, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్‌ మేగోటి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs