Advertisement
Google Ads BL

నారాయణమూర్తిని డైరెక్ట్‌ చేయనున్న పూరి..!!


ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఓ పూర్తిస్థాయి విప్లవచిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందునా ఈ సినిమాలో హీరోగా ఆర్‌.నారాయణమూర్తి నటిస్తున్నట్లు సమాచారం. బీ, సీ సెంటర్లలో కూడా సరైన మార్కెట్‌ లేని నారాయణమూర్తిని తన  సినిమాలో హీరోగా పూరి తీసుకోవడంపై ఇండస్ట్రీ నివ్వెరపోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను నారాయణమూర్తికి పూరి వినిపించారని, దీనికి ఆయన ఓకే చెప్పడంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ చార్మి ప్రధాన పాత్రలో 'జ్యోతిలక్ష్మి'ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తవగానే నారాయణమూర్తి చిత్రాన్ని పూరి ప్రారంభిస్తారని సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs