Advertisement
Google Ads BL

మార్చి 27న వరల్డ్‌వైడ్‌గా ‘రేయ్‌’


యంగ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా యలమంచిలి గీత సమర్పణలో  బొమ్మరిల్లువారి బ్యానర్‌పై  వైవియస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో సయామీఖేర్‌, శ్రద్ధాదాస్‌ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘రేయ్‌’.  అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేస్తున్నారు.  ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రెష్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను వై.వి.యస్‌.చౌదరి కుమార్తె యలమంచిలి యుక్త విడుదల చేశారు. ఈ సందర్భంగా...

Advertisement
CJ Advs

యలమంచిలి యుక్త: మా నాన్న చాలా అవాంతరాలను ఎదుర్కొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రతికూలతలను ఆయన మనోనిబ్బరంతో ఎదుర్కొన్నారు. ఈ చిత్రంలో నేను హీరో చెల్లెలుగా నటించాను. సాయిధరమ్‌తేజ్‌గారిలోని ఫుల్‌ ఎనర్జీని ఈ సినిమాలో చూడవచ్చు. ఆయన డాన్సులు అదరగొట్టారు. ప్రతి సన్నివేశం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో ఎక్కువ భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించారు. ప్రస్తుతం సినిమాని సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాని ఈ నెల 27న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌లెవల్‌ విడుదల చేయడానికి ప్లాన్‌ చేశాం. 

వై.వి.ఎస్‌.చౌదరి: నందమూరి తారకరామారావు దివ్యమోహన రూపం నన్ను ఈ సినిమా రంగంలోకి నడిపించింది. నా కష్టం, నా సుఖం వెనుక ఎన్టీఆర్‌ దీవెనలు, ఆయన వదిలి వెళ్లిన ఆశీస్సులున్నాయి. అదే నాకు మడమ తిప్పని ఆత్మవిశ్వాసాన్ని నేర్పింది. అదే నమ్మకంతో డైరెక్టర్‌గా, నిర్మాతగా కొనసాగుతున్నాను. ‘రేయ్‌’ సినిమా నాకు అద్భుతమైన అనుభవాన్ని మిగిల్చింది. ఇక్కడ వృత్తిరీత్యా వచ్చే కష్టాలు ఉంటూనే ఉంటాయి. దానికితోడు నాకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అనుకూలమైన ప్రొడక్షన్‌ కోసం చేసే యుద్ధంలో సినిమా విడుదల కాస్త డిలే అయింది. అంతే తప్ప ఇందులో ఎవరి తప్పూ లేదు. ఈ సినిమా ఆలస్యం కావడానికి చాలా కారణాలున్నాయి. సినిమా విడుదలై హిట్‌ అయ్యాక పుస్తకం రాస్తే చాలా ఆసక్తికరంగా వుంటుంది. మూడున్నర నాలుగేళ్ల పాటు ఓ చిత్రం చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. సాయిధరమ్‌తేజ్‌ అప్పియరెన్స్‌ నన్ను అతనివైపు తిప్పింది. సాయిధరమ్‌ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు అతనిలో నేను యంగ్‌ మెగాస్టార్‌ లుక్స్‌ని చూశాను. వెంటనే అతన్ని సంప్రదిస్తే తనను తన మావయ్యలు ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారని చెప్పాడు. వెంటనే నేను చిరంజీవి గారితోను, నాగబాబు గారితో, పవన్‌ కళ్యాణ్‌తోనూ మాట్లాడాను. నాకు ప్రతి దశలోనూ వారు మోరల్‌ సపోర్ట్‌ ఇచ్చారు. నా కెరీర్‌లో కొత్త వాళ్లతో ఇంతకు ముందు సినిమాలు చేశాను. వెంకట్‌, చాందినిలో సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రాన్ని  తొలి సినిమాగా చేశాను. అది బిగ్గెస్ట్‌ హిట్టయింది. తర్వాత ఆదిత్య ఓం, అంకితతో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చేశాను. తర్వాత రామ్‌, ఇలియానాలతో ‘దేవదాసు’ చిత్రాన్ని చేశాను అది బ్లాక్‌బస్టర్‌ హిట్టయింది. రి 48 ఏళ్ల వయసులో హరికృష్ణగారు హీరోగా సీతయ్య చిత్రం చేశాను. అది కూడా పెద్ద సక్సెస్‌ అయింది. ఇప్పుడు రేయ్‌ భారీ వాల్యూమ్‌, స్పాన్‌ వున్న సినిమా. ఈరోజు నుంచి పబ్లిసిటీ మొదలు పెడుతున్నాం. సినిమా ప్రారంభంలోనే ఈ చిత్రానికి పబ్లిసిటీలో ఒక స్టాంప్‌ వేయడం జరిగింది ‘మీ విలువైన సమయం వృథా కాదు. హండ్రెడ్‌ పర్సెంట్‌ శాటిస్పాక్షన్‌’ అనే మాటతో ఈ చిత్ర పబ్లిసిటీని మొదలు పెట్టాం.  గత వారంలో మా సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెల 27న వేసవికి కర్టెన్‌ రైజర్‌గా విడుదల చేస్తాం. ఇందుకు నాకు సహకరించిన రమేష్‌ప్రసాద్‌, విజయ్‌ ప్రసాద్‌, శోభన్‌బాబుగార్లకు ధన్యవాదాలు. ఈ చిత్రంలో హీరో పేరు రాకెట్‌ అలియాస్‌ రాకీ. సాయిధరమ్‌ తేజ్‌ సినిమాలు చేసినంత అనుభవంతో చేశాడు. తనతో భవిష్యత్‌లోనూ ఇంకో సినిమా చేస్తాను. ‘దేవదాస్‌’లో ఇలియానా చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఫొటోల కోసం మా పాప యుక్త ఫోటోలను వాడాను. ఈ సినిమాలో తను హీరో సిస్టర్‌గా నటించింది. తప్పకుండా మెగాభిమానులను అలరించే చిత్రమవుతుంది.

సాయిధరమ్‌తేజ్‌: మార్చి 27 నాకు సెంటిమెంట్‌. 2011 మార్చి 27న తొలిసారి నా ఫొటోషూట్‌ జరిగింది. 2012 మార్చి 27న ‘రేయ్‌’ సినిమా ఓపెనింగ్‌ జరిగింది. 2015 మార్చి 27న ఈ సినిమా విడుదల కానుండడం నాకు ఆనందంగా వుంది. నాలుగేళ్లుగా ఇదే సినిమా గురించి ఆలోచిస్తున్నారు వైవిఎస్‌ చౌదరిగారు. ఆయనతో తప్పకుండా భవిష్యత్‌లోనూ ఓ చిత్రం చేస్తాను.

సాయిధరమ్‌తేజ్‌, సయామీఖేర్‌, శ్రద్ధాదాస్‌, అర్పిత రాంకా, తనికెళ్ల భరణి, నరేష్‌, ఆలీ, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, వేణుమాధవ్‌, హేమ, గుండు సుదర్శన్‌, శివనారాయణ,  నియోల్‌సేన్‌, మణికిరణ్‌, సుభాష్‌,  మధు, నీలేష్‌శర్మ తదితరులు ఇతర పాత్రధారులు.

ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్‌ సీపాన, కెమెరా: గుణశేఖరన్‌, ఎడిటర్‌: గౌతంరాజు, సంగీతం: చక్రి, పాటలు: చంద్రబోస్‌, ర్యాప్‌: నియోల్‌సీన్‌, ఆర్ట్‌: రఘు కులకర్ణి, అడిషనల్‌ స్క్రీన్‌ప్లే, డైలాగులు: రాజా సింహ టి., డాన్స్‌ మాస్టర్స్‌: బృంద, రాజు సుందరం, ప్రేమ్‌రక్షిత్‌, శేఖర్‌, జాని, ఫైట్స్‌: స్టన్‌ శివ, విజయ్‌ , గణేష్‌, జోష్‌ జాషువ, సహ నిర్మాతలు: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: యలమంచిలి గీత, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: వైవిఎస్‌ చౌదరి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs