Advertisement
Google Ads BL

‘ప్రేమా ఓ ప్రేమ’ ట్రైలర్స్‌ లాంచ్‌


మహేష్‌, నీతు హీరో హీరోయిన్లుగా రాధ సమర్పణలో కౌశిక్‌ ఫిలిమ్స్‌ పతాకంపై టి.రాము దర్శకత్వంలో కామేశ్వరరావు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ప్రేమా ఓ ప్రేమ’. ఈ చిత్రం టీజర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌ లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. మొదటి ట్రైలర్‌ను సీనియర్‌ దర్శకుడు సాగర్‌ ఆవిష్కరించగా, రెండో ట్రైలర్‌ను దర్శకనిర్మాత సాయి వెంకట్‌ విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీరంగం సతీష్‌, పొందూరి రామ్మోహన్‌, బాలాజీ, బి.ఎ.పాల్‌, గంగాధర్‌, కళ్యాణ్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

సాగర్‌: ఈ సినిమాని అందరూ కొత్తవారు కలిసి చేశారు. ఒక మంచి ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రం పెద్ద సక్సెస్‌ అయి దర్శకనిర్మాతలకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. 

సాయివెంకట్‌:  నిర్మాత కామేశ్వరరావు చాలా కాలంగా నాకు తెలుసు. ఈ సినిమా కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో కూడా నాకు తెలుసు. ఇక డైరెక్టర్‌ రాము గురించి చెప్పాలంటే అతనికి నాటక అనుభవం చాలా వుంది. ఒక మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందించడం కోసం యూనిట్‌ చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా సక్సెస్‌ అవుతుందని ఆశిస్తున్నాను. 

కొండవలస: ఈమధ్యకాలంలో చిన్న సినిమాలు బాగా సక్సెస్‌ అవుతున్నాయి. మంచి కాన్సెప్ట్‌లతో సినిమాలు రూపొందిస్తున్నారు. అదే బాటలో ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి యూనిట్‌లోని అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను.

అర్జున్‌: ఇది మంచి ప్రేమకథ. డైరెక్టర్‌ రాముగారు చాలా చక్కగా తీశారు. త్వరలోనే ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ వుంటుంది. హీరో హీరోయిన్లు బాగా పెర్‌ఫార్మ్‌ చేశారు. ఇందులో విలన్‌గా నటించిన రాజేష్‌కి ఈ సినిమా బాగా ప్లస్‌ అవుతుంది. 

కామేశ్వరరావు: నటుడ్ని అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. రాముగారు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా స్టార్ట్‌ చేశాను. ఒరిస్సాలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించాం. అందరూ మెచ్చే మంచి ప్రేమకథ ఇది. రాముగారి డైరెక్షన్‌గానీ, అర్జున్‌గారి అందించిన సంగీతంగానీ సినిమాకి మంచి సక్సెస్‌ని ఇస్తుందన్న నమ్మకం నాకు వుంది. 

టి.రాము: కథ చెప్పగానే ఈ సినిమా చెయ్యాలని కామేశ్వరరావుగారు చాలా స్పీడ్‌గా డెసిషన్‌ తీసుకున్నారు. మేం అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చింది. అర్జున్‌గారి సంగీతం ఈ చిత్రానికి చాలా ప్లస్‌ అవుతుంది. పదిరోజుల్లో ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. అలాగే సినిమాని కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. 

మహేష్‌, నీతూ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేష్‌, సంపత్‌రాజు, జూ॥ రేలంగి, జ్యోతిశ్రీ, విశ్వనాథరెడ్డి, రాము, హనీష్‌, మనోహర్‌, శివగణేష్‌, సుందరమ్మ, గణేష్‌, చైతన్య, సాయిభార్గవ్‌, పులకేశి, శ్రావణి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌, కెమెరా: నారాయణ పార్శపు, పాటలు: టి.రాము, సుమన్‌, ఎడిటర్‌: వేణు చౌదరి, కో`డైరెక్టర్‌: ఇంద్ర శ్రీనివాస్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌: మణికంఠ గుప్తా, నిర్మాత: కామేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: టి.రాము.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs