Advertisement
Google Ads BL

‘ఫాదర్‌’ ఆడియోను ఆవిష్కరించిన షాయాజీ షిండే


కమల్‌ కామరాజ్‌, షాయాజీ షిండే ప్రధాన పాత్రల్లో నవదీప్‌ ఫిల్మ్‌ క్రియేటివ్‌ పతాకంపై జగదీష్‌ వటర్కర్‌ దర్శకత్వంలో రాజ్‌ పచ్‌ఘరె నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘ఫాదర్‌’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో షాయాజీ షిండే, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, శ్రీసురేష్‌, నగేష్‌ నారదాశి, గోపికృష్ణ, స్నేహ తదితరులు పాల్గొన్నారు. షాయాజీ షిండే ‘ఫాదర్‌’ ఆడియోను ఆవిష్కరించారు. యువరాజ్‌ మోరె సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో జివికె4 ద్వారా మార్కెట్‌లోకి రిలీజ్‌ అయింది. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

రాజ్‌ పచ్‌ఘరె: ఈ సినిమాని మొదట హిందీలో చేద్దామని స్టార్ట్‌ చేశాం. రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు తెలుగులో కూడా చేస్తే బాగుంటుంది అనిపించి తెలుగు వెర్షన్‌ కూడా చేశాం. ఒక మంచి మెసేజ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. నేత్రదానం గురించి ఇందులో అందరికీ అర్థమయ్యేలా చెప్పాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

జగదీష్‌ వటర్కర్‌: ఇందులో ఒక మంచి తండ్రి క్యారెక్టర్‌ వుంటుంది. మెసేజ్‌తోపాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. తెలుగులో ఈ చిత్రాన్ని చెయ్యడంలో ఎంతో మంది సపోర్ట్‌ చేశారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. 

షాయాజీ షిండే: పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ఈ ఆడియో పెద్ద హిట్‌ అవుతుంది. తెలుగులో ఫస్ట్‌ టైమ్‌ ఒక సినిమాని ప్రొడ్యూస్‌ చేస్తున్న నిర్మాత రాజ్‌గారికి ఈ సినిమా మంచి సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో మెసేజ్‌ వున్నప్పటికీ సినిమా మొత్తం చాలా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. మా యూనిట్‌లోని అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్తూ ఈ సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను.

కమల్‌ కామరాజ్‌, షాయాజీ షిండే, జ్యోతి, స్నేహ, సాయిప్రదీప్‌, కావేరి, చిన్మయ్‌ దేశ్‌కర్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువరాజ్‌ మోరె, కెమెరా: శంకర్‌ పి. నాయుడు, నిర్మాత: రాజ్‌ పచ్‌ఘరె, దర్శకత్వం: జగదీష్‌ వటర్కర్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs