Advertisement
Google Ads BL

‘ది బెల్స్‌’ ఆడియో రిలీజ్‌!


రాహుల్‌, నేహ దేశ్‌పాండే హీరోహీరోయిన్లుగా జగదాంబ ప్రొడక్షన్స్‌ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌చందర్‌ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ది బెల్స్‌’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ బుధవారం హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగరరావు ‘ది బెల్స్‌’ ఆడియోను ఆవిష్కరించి నల్లాల ఓదేష్‌కి అందించారు. కాసర్ల శ్యామ్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇంకా ఈ కార్యక్రమంలో స్పీకర్‌ మధుసూదనాచారి, రసమయి బాలకిషన్‌, ఎన్‌.శంకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, అల్లాణి శ్రీధర్‌, సానా యాదిరెడ్డి, సంగీత దర్శకుడు కాసర్ల శ్యామ్‌, హీరో రాహుల్‌, నిర్మాత ఎర్రోజు వెంకటాచారి, నెల్లుట్ల ప్రవీణ్‌చందర్‌ తదితరులు పాల్గొన్నారు. 
విద్యాసాగరరావు: నిర్మాత వెంకటాచారిగారు ఎంతో అభిరుచితో ఈ సినిమా చేశారు. ట్రైలర్స్‌, సాంగ్స్‌ చాలా బాగున్నాయి. ఈ ఆడియో, సినిమా పెద్ద హిట్‌ అయి నిర్మాతకు, చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.
మధుసూదనాచారి: సినిమా అనేది కొన్ని వర్గాలు, కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితమైంది. తెలంగాణ ఎంతో డెవలప్‌ అవుతున్న తరుణంలో తెలంగాణాలోని నిర్మాతలు, దర్శకులు సినిమాలు రూపొందించడం చాలా సంతోషంగా వుంది. 
ఇంద్రకరణ్‌రెడ్డి: ఈ చిత్రంలో ఆదిలాబాద్‌లోని పలు అందమైన లొకేషన్స్‌ చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత మంచి సినిమా చేయడం ఆనందంగా వుంది. 
రసమయి బాలకిషన్‌: చారి గురించి నాకు బాగా తెలుసు. ఈ చిత్రానికి సంగీతం అందించిన శ్యామ్‌ నాకు ఎప్పటి నుంచో తెలుసు. 25 సంవత్సరాల క్రితం నేను పాడిన ఓ కాలేజీ పాటను ఈ చిత్రంలో నాతో పాడిరచాడు. శ్యామ్‌కి ఈ సినిమా తప్పకుండా మంచి పేరు తెస్తుంది. అలాగే దర్శకనిర్మాతలకు కూడా ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. 
ఎన్‌.శంకర్‌: పాటలు, ట్రైలర్స్‌ చాలా బాగున్నాయి. ఈ ఫంక్షన్‌ చూడడానికి వచ్చిన ఈ ఆడియన్స్‌ స్పందన చూస్తుంటే దాన్ని మించి రెస్పాన్స్‌ థియేటర్‌లో వస్తుందన్న నమ్మకం కలుగుతోంది. ‘ది బెల్స్‌’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది. 
రాహుల్‌: ప్రవీణ్‌ చాలా టాలెంట్‌ వున్న డైరెక్టర్‌. శేఖర్‌ అందించిన కథను చాలా బాగా హ్యాండిల్‌ చేసి మంచి సినిమా తీశారు. మా నిర్మాత వెంకటాచారిగారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాని చాలా రిచ్‌గా తీశారు. కాసర్ల శ్యామ్‌ చేసిన పాటలన్నీ చాలా బాగున్నాయి. 
ఎర్రోజు వెంకటాచారి: ప్రవీణ్‌ చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు అందంగా తెరమీద చూపించాడు. ఒక కమర్షియల్‌ సినిమాకి వుండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో వున్నాయి. ఈ సినిమా ద్వారా యూత్‌కి ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తున్నాం. 
నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌: ఈ సినిమాలో మంచి కథతోపాటు చక్కని మెసేజ్‌ కూడా వుంది. ఈ చిత్రంలో విద్యాసాగరరావుగారు ఒక గెస్ట్‌ రోల్‌ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. కాసర్ల శ్యామ్‌ మ్యూజిక్‌ చాలా బాగుంది. పాటలు కూడా విజువల్‌గా అద్భుతంగా వచ్చాయి. ఇలాంటి మంచి సినిమా చేయడానికి తన పూర్తి సహకారాన్ని అందించిన వెంకటాచారిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs