రెండేళ్ళకోసారి జరిగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే ఎన్నికల తేదిని ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సారి కొత్త బాడీతో మా అసోసియేషన్ టీమ్ ఉండబోతుందని సమాచారం. ఇప్పటి వరకు ‘మా’ అధ్యక్షుడిగా మురళీమోహన్ కొనసాగగా ఈ సారి మాత్రం ‘మా’ ప్రెసిడెంట్‌గా కొత్త వ్యక్తిని ఎన్నుకోబోతున్నారట. టోటల్ కమిటీకి సంబంధించి కొత్త మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. అయితే ‘మా’ ఎన్నికలు మాత్రం రెండేళ్ళకు ఒకసారి అనుకున్న సమయానికి జరుగుతున్నాయి. చాంబర్ ఎలక్షన్స్ గడుపు పూర్తయినప్పటికీ ఇంకా ఎలక్షన్లు నిర్వహించక పోవడం ప్రస్తుతం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.