కిక్‌తో రవితేజ సంచలన విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు ఆయన ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ కిక్‌లో హీరో పాత్రకు కేవలం రవితేజ మాత్రమే న్యాయం చేయగలిగాడని అభిమానులు మాట్లాడుకున్నారు. ఇక ఈ సినిమకు సురేందర్‌రెడ్డి కొనసాగింపుగా కిక్-2ను తీస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కిక్-2ను ఇక మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ చివరి వారంలో ఆడియో,ి మే 9న సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక కిక్-2ను నందమూరి కల్యాణరామ్ నిర్మిస్తుండగా.. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయినగా నటిస్తోంది. ఇక కిక్ స్థాయిలో దాని సీక్వెల్ కూడా విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే మే9 వరకు వేచిచూడాల్సిందే..!