దాసరి సినిమాలో పవన్‌కల్యాణ్ నటించనున్నాడన్న వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. గబ్బర్‌సింగ్-2 తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి దాసరి మొదట పవన్ అభిమానులను తీవ్ర అయోమయానికి గురిచేశారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో తన దర్శకత్వంలో తర్వాతి సినిమా పవన్‌కల్యాణ్‌తోనని రాసుకొచ్చాడు. ఇది చూసిన పవన్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాదాపుగా రెండు దశాబ్దాల క్రితం ఒసేయ్ రాములమ్మతో హిట్‌నిచ్చిన దాసరి ఆ తర్వాత తీసిన సినిమాలన్ని డిజాస్టర్లుగానే నిలిచాయి. తాజాగా వచ్చిన ఎర్రబస్సు కూడా ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు పోయిందో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో దాసరితో సినిమాకు పవన్ ఎలా ఒప్పుకున్నారని అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక అభిమానుల అయోమయానికి తెరదించుతూ.. దాసరి కొద్దిసేపటికే ట్విట్టర్లో తన పోస్టును సవరించాడు. తన బ్యానర్‌లో తర్వాతి సినిమా పవన్‌తోనే అని చెప్పడానికి సంతోషిస్తున్నా.. అని ఆయన పోస్టును సవరించగానే పవర్‌స్టార్ అభిమానులు కూడా సంతోషపడ్డారు.