Advertisement
Google Ads BL

రిలీజ్‌కి రెడీ అయిన ‘టోల్‌ ఫ్రీ నెంబర్‌ 143'


శ్రీహరి ఉదయగిరి, హేమంతిని, రోషిక ముఖ్యపాత్రల్లో భాస్కర గ్రూప్‌ ఆఫ్‌ మీడియా పతాకంపై వి.ఎస్‌.వాసు దర్శకత్వంలో దాసరి భాస్కర్‌ యాదవ్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘టోల్‌ ఫ్రీ నెంబర్‌ 143(ఇది చాలా కాస్ట్‌ గురూ..). ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీహరి ఉదయగిరి, హీరోయిన్‌ రోషికా, దర్శకుడు వి.ఎస్‌.వాసు, నిర్మాత దాసరి భాస్కర్‌ యాదవ్‌, సంగీత దర్శకుడు శ్రీవెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

భాస్కర్‌యాదవ్‌: ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మార్చిలో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద సక్సెస్‌ అయింది. ఇందులోని 7 పాటల్ని శ్రీవెంకట్‌గారు చాలా అద్భుతంగా చేశారు. ఆన్‌లైన్‌లో ఈ పాటలకు చాలా డౌన్‌లోడ్స్‌ వస్తున్నాయి. కథ విషయానికి వస్తే ఇది అందరికీ కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌. ఈ సినిమాని సెన్సార్‌కి పంపించాం. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి కాగానే రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేస్తాం. హీరో శ్రీహరిగారు చాలా చక్కగా తన పాత్ర పోషించారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించి మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.

వి.ఎస్‌.వాసు: ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నేను అనుకున్న దానికంటే శ్రీవెంకట్‌ చాలా మంచి మ్యూజిక్‌ చేశాడు. మ్యూజిక్‌ సినిమాకి చాలా హెల్ప్‌ అయింది. ఇందులో గబ్బర్‌సింగ్‌ గ్యాంగ్‌తో చేసిన ఎపిసోడ్‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ గ్యాంగ్‌తో పాటలతో చేసిన ఒక ఫైట్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. మాకు వున్న లిమిటెడ్‌ బడ్జెట్‌లో అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో చాలా పెద్ద రేంజ్‌లో చేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందర్నీ ఆకట్టుకుంటుంది.

శ్రీవెంకట్‌: ఈ చిత్రంలోని పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌. అన్ని సాంగ్స్‌ బాగా రావడానికి మా నిర్మాత, దర్శకులు ఎంతో సహకరించారు. ఆర్‌.ఆర్‌. కూడా చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ చెయ్యాలనుకుంటున్నాం. 

రోషిక: ఈ సినిమాకి సంబంధించి అందరం దాదాపు కొత్తవాళ్ళమే. అయినా సినిమాని చాలా రిచ్‌గా తీశారు. ఈ చిత్రంలోని పాటలు ఎలక్ట్రానిక్‌ మీడియాలో చాలా పాపులర్‌ అయ్యాయి. ఇందులో ఫోక్‌సాంగ్‌, మాస్‌ సాంగ్‌, ఐటమ్‌ సాంగ్‌ ఇలా అన్ని రకాల పాటలు వున్నాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మార్చిలో విడుదలవుతున్న ఈ చిత్రం మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. 

శ్రీహరి ఉదయగిరి, హేమంతిని, రోషికా, మహావీర్‌, అస్రిద్‌ మదుర్‌, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్‌, సుమన్‌ శెట్టి, రోలర్‌ రఘు, ధన్‌రాజ్‌, చమ్మక్‌ చంద్ర, సంధ్యా రaనక్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీవెంకట్‌, సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్‌ సబ్బి, మాటలు: మహేష్‌ ఎల్‌., ప్రొడక్షన్‌ డిజైనర్‌: బన్సి కె., డాన్స్‌: పాల్‌ వేణు, ఫైట్స్‌: రవి, నిర్మాత: దాసరి భాస్కర్‌ యాదవ్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఎస్‌.వాసు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs