Advertisement
Google Ads BL

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఆడియో రిలీజ్‌


గతంలో ఎన్టీఆర్‌ హీరోగా ‘స్టూడెంట్‌ నెం.1’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన స్వప్న సినిమా పతాకంపై నాని హీరోగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ పేరుతో ఓ విభిన్న చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్‌ సెంటర్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. యం.యం.కీరవాణి ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని ఎస్‌.ఎస్‌.రాజమౌళికి అందించారు. రదన్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో లహరి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో ఎన్టీఆర్‌, కె.రాఘవేంద్రరావు, లక్ష్మీ మంచు, నందినిరెడ్డి శర్వానంద్‌, క్రిష్‌, క్రాంతి మాధవ్‌, అవసరాల శ్రీనివాస్‌, నవదీప్‌, క్రాంతిమాధవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

Advertisement
CJ Advs

ఎన్టీఆర్‌: ఈ బేనర్‌లో నేను స్టూడెంట్‌ నెం.1 సినిమా చేశాను. సూపర్‌హిట్‌ అయింది. ఇప్పుడు అదే బేనర్‌లో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా స్టూడెంట్‌ నెం.1 కంటే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. నాని చాలా మంచి నటుడు. అతను నటించిన పిల్ల జమీందార్‌ చిత్రాన్ని చాలా సార్లు చూశాను. అతనికి ఈ సినిమా మరో మంచి విజయాన్ని అందిస్తుంది.

ఎస్‌.ఎస్‌.రాజమౌళి: నేను డైరెక్ట్‌ చేసిన మొదటి సినిమా స్టూడెంట్‌ నెం.1 స్వప్న సినిమా బేనర్‌లోనే నిర్మించడం జరిగింది. ఆ బేనర్‌లో వస్తోన్న ఎవడే సుబ్రహ్మణ్యం ట్రైలర్‌ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంది. సినిమా చూడాలన్న క్యూరియాసిటీ కలుగుతోంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా విజయం సాధించాలని, యూనిట్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నాను.

శేఖర్‌ కమ్ముల: నాగ్‌అశ్విన్‌ లీడర్‌ సినిమాకి వర్క్‌ చేశాడు. అతని టాలెంట్‌ చూసి త్వరలోనే డైరెక్టర్‌ అవుతాడనుకున్నాను. నాని నాకు ఎంతో ఇష్టమైన నటుడు. అతని కెరీర్‌లో ఈ సినిమా మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది.

క్రిష్‌: స్వప్న సినిమా నిర్మాతలకు సినిమా అంటే మంచి ప్యాషన్‌ వుంది. ఏ సినిమా చేసినా డిఫరెంట్‌గా వుండాలని ట్రై చేస్తారు. ఆ ప్రయత్నంలో వస్తున్న సినిమాయే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా పూర్తిగా డైరెక్టర్స్‌ సినిమా అని చెప్పొచ్చు. ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమా కోసం ఎదురుచూస్తున్నాను.

నాని: ఈ సినిమా కోసం 35 మందితో కలిసి వెళ్ళి చాలా కష్టపడ్డాం. ఆక్సిజన్‌ కూడా సరిగ్గా అందని ప్రదేశంలో షూటింగ్‌ చేయడానికి ఎంతో శ్రమించాం. అయినా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం పూర్తి చేయగలిగాం. ఇంత మంచి సినిమా చేయడంలో నిర్మాతల కోఆపరేషన్‌ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ఒక కొత్త తరహా సినిమాగా వస్తున్న ఎవడే సుబ్రహ్మణ్యం తప్పకుండా అందరికీ నచ్చుతుంది.

నాగ్‌ అశ్విన్‌: నన్ను, నా స్క్రిప్ట్‌ని నమ్మి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన స్వప్న, ప్రియాంకలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా బాగా రావడంలో భాగస్వాములయ్యారు. అందరికీ పేరు పేరునా థాంక్స్‌ చెప్తున్నాను. రథన్‌ చాలా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం నాకు వుంది. 

స్వప్నదత్‌: ఇది ఒక యునీక్‌ సబ్జెక్ట్‌. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాము. ఇలాంటి డిఫరెంట్‌ సబ్జెక్ట్‌ని తెరకెక్కించడంలో హీరో నాని, మిగతా నటీనటులు, ప్రతి టెక్నీషియన్‌ ఎంతో కోఆపరేట్‌ చేశారు. అందరి సపోర్ట్‌తోనే అనుకున్న టైమ్‌కి సినిమాని కంప్లీట్‌ చేయగలిగాం.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs