Advertisement
Google Ads BL

ఎన్టీఆర్‌ సినిమాలో జగపతిబాబు..??


ప్రస్తుతం 'టెంపర్‌' హిట్‌తో జూనియర్‌ ఎన్టీఆర్‌ రిలీఫ్‌ పొందాడు. వరుస ప్లాఫులతో డీలా పడ్డ ఆయనలో మళ్లీ 'టెంపర్‌' కాన్ఫిడెన్స్‌నింపింది. ప్రస్తుతం ఈ సినిమాకు పోటీగా మరో సినిమా కూడా లేకపోవడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది 'టెంపర్‌'. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో నటించనున్న సినిమాపై దృష్టిపెట్టారు. డిసెంబర్‌లోనే లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభించుకున్న ఈ సినిమా మార్చి నుంచి పూర్తిస్థాయిలో పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో జగపతిబాబు నటిస్తున్నట్లు సమాచారం. తండ్రి సెంటిమెంట్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే సుకుమార్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగపతిబాబు మరి ఎన్టీఆర్‌కు తండ్రిగా కనిపిస్తారా..? లేక నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న విలన్‌పాత్రలో నటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను సుకుమార్‌ డిఫరెంటుగా చూపిస్తున్నట్లు సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs