పినాకిన్ ఆర్ట్స్ బ్యానర్ పై, శ్రీమతి పద్మలత సమర్పణలో, రామ్ దివ్యేష్, స్పందన అల్లూరి, ప్రధాన పాత్రధారులుగా మోహన్ నిమ్మకాయల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం"చేజ్"(CHASE). ఈ చిత్రం ప్రస్తుతం పొస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. పొస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత మోహన్ నిమ్మకాయల మాట్లాడుతూ; పొస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. వారం రోజుల్లో తొలి కాపి సిద్ధమవుతుంది. మార్చి ప్రధమార్ధంలో సినిమాని రెలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము.ఈ సినిమా ద్వారా కధానాయకుడుగా పరిచయమౌతున్న రామ్ దివ్యేష్ మంచి నటనను కనపరిచాడు."చేజ్" సినిమాని మొత్తం అమెరికాలోని అందమైన ప్రదేశాలలో చిత్రికరించటం జరిగింది. సంగీత దర్శకుడు శంకర్ తమిరి సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు ఇటివల ఆదిత్య మ్యూజిక్ ద్వారా మర్కెట్‌లో రిలీజై మంచి రెస్పాన్స్‌ను సోంతం చేసుకున్నాయి. ఇంకా ఈ చిత్రంలో నిశాంత్, లోకనాథ్ పరవస్తు, హరి రామ్, పిల్ అవ్డా, టాం హెన్రి,Chris గిల్మోరే తదితరులు ముఖ్యపాత్రలను పొషించారు అని అన్నారు.
సంగితం; శంకర్ తమిరి, గేయ రచయిత; వేణు జయరాం, కథ: రాజేష్ జగన్నాధం, సినిమాటోగ్రాఫర్: ట్రాయ్ బకేవేల్ల్,డాన్సు;అనిల్ హరి, రేని జాయ్, రోషని,స్టంట్స్: టామ్ హెన్రీ, సమర్పణ: పద్మలత, నిర్మాత- దర్శకత్వం: మోహన్ నిమ్మకాయల.