Advertisement
Google Ads BL

‘సూర్య వర్సెస్‌ సూర్య’ ఆడియో లాంచ్‌


స్వామిరారా, కార్తికేయ వంటి హిట్‌ చిత్రాలతో సక్సెస్‌లో వున్న హీరో నిఖిల్‌కి హ్యాట్రిక్‌ మూవీగా రాబోతున్న ‘సూర్య వర్సెస్‌ సూర్య’ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో జరిగింది. బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి సత్య మహావీర్‌ సంగీతం అందించగా, ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ బిగ్‌ సీడీని ఆవిష్కరించారు. రవాణా శాఖమంత్రి మహేందర్‌రెడ్డి ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సి.డి.ని హీరో నిఖిల్‌కి అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే రసమయి బాలకిషన్‌, ఎం.పి. బి.వి.పాటిల్‌, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, యం.యస్‌.రాజు, సందీప్‌ కిషన్‌, తనికెళ్ళ భరణి, డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని, హీరోయిన్‌ త్రిదా, ఆదిత్య మ్యూజిక్‌ సత్యదేవ్‌, కె.వి.వి.సత్యనారాయణ, సురేష్‌ కొండేటి, ఎన్‌.శంకర్‌, హీరో సుశాంత్‌, హీరో సచిన్‌ జోషి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరో నిఖిల్‌ ఫేస్‌బుక్‌లో రన్‌ చేసిన కాంటెస్ట్‌లో ఎంపికైన ఆరు జంటలను ఈ ఆడియో ఫంక్షన్‌కి ఆహ్వానించి వారిచేత ఒక్కోపాటను విడుదల చేయించారు. ఈ సందర్భంగా...

Advertisement
CJ Advs

తలసాని శ్రీనివాసయాదవ్‌: నిఖిల్‌కి ఈ సినిమా మంచి సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈమధ్య చాలా సినిమాలు వస్తున్నా శివకుమార్‌గారికి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం వుంది. ఎప్పటికప్పుడు కొత్తదనంతో సినిమాలు చేస్తూ సక్సెస్‌ అవుతున్నారు. ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో చేస్తున్న ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్‌ అవ్వాలి. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ చాలా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. 

ఎన్‌.శంకర్‌: శివకుమార్‌గారు భద్రాద్రి సినిమాతో ప్రొడ్యూసర్‌గా ఎంటర్‌ అయ్యారు. ఆ సినిమా టైమ్‌కి శ్రీహరిగారి మార్కెట్‌ కాస్త డల్‌గా వుంది. అయినప్పటికీ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఆ సినిమాని చాలా రిచ్‌గా నిర్మించారు. ఆ తర్వాత చేసిన ఆకాశంలో సగం సినిమా కావచ్చు, ఇప్పుడు ఈ సినిమా కావచ్చు. కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. ఈ సినిమాతో కార్తీక్‌ డైరెక్టర్‌గా, సత్య మహావీర్‌ని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా మంచి హిట్‌ కావాలి, అందరికీ మంచి పేరు తేవాలి.

వీరభద్రం చౌదరి: శివకుమార్‌గారు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. అలాగే హీరో నిఖిల్‌తో హీరో అవ్వకముందు నుంచే నాకు పరిచయం వుంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌ని ఎంచుకుంటూ సినిమా చేస్తున్నాడు. తెలుగు సినిమాని ఓ కొత్తదారిలో తీసుకెళ్తున్న నిఖిల్‌కి ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను. 

తనికెళ్ళ భరణి: కార్తీక్‌ ఈ సినిమా కథ చెప్పినపుడు నాకు అర్థమైంది ఈ సినిమాని పూర్తిగా రాత్రిళ్ళు తీస్తారని. నైట్‌ షూటింగ్‌ అంటే నాకు చాలా ఇబ్బంది అని చెప్పాను. అయినప్పటికీ దైవికంగా అన్నీ కుదిరి ఈ సినిమాని చేశాను. కార్తీక్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ సినిమా తీశాడు. భవిష్యత్తులో చాలా పెద్ద డైరెక్టర్‌ అవుతాడని నేను చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. 

సందీప్‌ కిషన్‌: ఈ సినిమాకి సంబంధించి ముందుగా నిఖిల్‌కి కంగ్రాట్స్‌ చెప్పాలంటే. అతను మంచి డైరెక్టర్లని సెలెక్ట్‌ చేసుకోవడంలోనే ముందు సక్సెస్‌ అవుతున్నాడు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న కార్తీక్‌ చాలా మంచి సినిమాటోగ్రాఫర్‌. ఒక 5డి కెమెరాతో ఎలాంటి అద్భుతాలు చెయ్యొచ్చో చేసి చూపించాడు. ఎన్నో ప్రత్యేకతలు వున్న ఈ సినిమా నిఖిల్‌కి చాలా పెద్ద హిట్‌ సినిమా అవుతుంది. 

సుశాంత్‌: ఈ సినిమా పోస్టర్‌ చూడగానే చాలా యూనిక్‌గా వున్నాయనిపించింది. టీజర్‌ నాకు చాలా బాగా నచ్చింది. స్వామిరారా, కార్తికేయ చిత్రాలతో మంచి సక్సెస్‌ సాధించిన నిఖిల్‌కి ఈ సినిమా తప్పకుండా హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. 

కార్తీక్‌ ఘట్టమనేని: నాకు షార్ట్‌ ఫిలిం చేయడానికే ఆరు నెలలు పడుతుంది. అలాంటిది ఈ సినిమాని ఆరు నెలల్లో పూర్తి చేశాను. ఈ సినిమాని అనుకున్న టైమ్‌లో పూర్తి చేయడానికి సహకరించిన నిఖిల్‌కి, చందుకి చాలా థాంక్స్‌. ముఖ్యంగా నాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఒక మంచి సినిమా చేయడానికి కోఆపరేట్‌ చేసిన నిర్మాత శివకుమార్‌గారికి థాంక్స్‌. 

హీరోయిన్‌ త్రిదా: తెలుగులో ఇది నా తొలి సినిమా. నిఖిల్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఇంత మంచి సినిమాలో నేనూ ఒక పార్ట్‌ అయినందుకు హ్యాపీగా వుంది.

మల్కాపురం శివకుమార్‌: ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో చేసిన సినిమా ఇది. కార్తీక్‌ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా బాగా రావడానికి సహకరించారు. వారందరికీ థాంక్స్‌.

సత్య మహావీర్‌: నాకు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత శివకుమార్‌గారికి, దర్శకుడు కార్తీక్‌కి, నిఖిల్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. పాటలు కూడా మీ అందరికీ బాగా నచ్చుతాయి. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది. 

నిఖిల్‌: ఈ సినిమాకి సంబంధించి నేను థాంక్స్‌ చెప్పాల్సిన వ్యక్తులు ఇద్దరు.  వారు చందు, కార్తీక్‌. వారిద్దరూ కలిసి నాకు ఒక మంచి సినిమా చేశారు. ఒక మంచి సినిమా తియ్యాలన్న ఉద్దేశంతోనే అందరం ఒక టీమ్‌గా వర్క్‌ చేశాం. దానికి నిర్మాత శివకుమార్‌గారు ఎంతో ఎంకరేజ్‌ చేశారు. ఈ సినిమా నాకు హ్యాట్రిక్‌ మూవీ అవుతుందని అందరూ అంటున్నారు. అయితే హ్యాట్రిక్‌ కొట్టాలన్న ఆలోచన నాకు అస్సలు లేదు. ఒక మంచి సినిమా చెయ్యాలన్న ఆలోచన మాత్రమే వుంది. మేం ఎంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మీరు పెద్ద హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs