Advertisement

మార్చి మొదటి వారంలో ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే..’


ఎస్‌.పి.బాలు తనయుడు ఎస్‌.పి.చరణ్‌ నిర్మాతగా క్యాపిటల్‌ వర్క్స్‌ పతాకంపై మధుమిత దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే..’. ప్రముఖ రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందుమౌళి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వెన్నెలకంటి, శశాంక్‌ వెన్నెలకంటి, రాకేందుమౌళి పాల్గొన్నారు. 

Advertisement

వెన్నెలకంటి: మా అబ్బాయిలు శశాంక్‌, రాకేందు రైటర్స్‌గా అందరికీ పరిచయమే. ఇప్పుడు ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే..’ చిత్రం ద్వారా రాకేందు హీరోగా పరిచయం అవుతున్నాడు. చరణ్‌గారు తమిళ్‌లో చాలా సినిమాలు నిర్మించారు. తెలుగులో ఆయన నిర్మిస్తున్న ఫస్ట్‌ మూవీ ఇది. బాలుగారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి చేసిన చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. 

శశాంక్‌ వెన్నెల: మా రాకేందు ఈ సినిమా ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్‌ అవుతున్నందుకు హ్యాపీగా వుంది. యూత్‌కి, ఫ్యామిలీకి నచ్చే అన్ని ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన చిత్రమిది. కార్తికేయ మూర్తి చాలా మంచి సంగీతాన్ని అందించారు. తమిళ్‌లో ఆల్రెడీ రెండు సినిమాలు చేసిన మధుమితగారు ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో రిలీజ్‌ చేయబోతున్నారు. 

రాకేందుమౌళి: ఈ సినిమాలో నేను హీరోగా నటించడం చాలా హ్యాపీగా వుంది. నాతోపాటు చాలా మంది కొత్తవారు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం డైలాగ్స్‌ రాయడానికి వెళ్ళిన నన్ను హీరోగా చెయ్యమన్నారు. ఇంత మంచి చిత్రం ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్‌ అవడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇద్దరు కుర్రాళ్ళు ఓ రాత్రి తీసుకున్న నిర్ణయం ద్వారా వారి జీవితాల్ని ఎలాంటి మలుపు తిప్పిందనేదే కథ. 

ఈ చిత్రానికి సంగీతం: కార్తికేయ మూర్తి, కెమెరా: శ్రీనివాస్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, ఎడిటింగ్‌: కిరణ్‌ గంటి, ఆర్ట్‌: మోహన్‌ జీ, నిర్మాత: ఎస్‌.పి.చరణ్‌, దర్శకత్వం: మధుమిత.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement