మంచు వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మంచు మోహన్‌బాబు చిన్నకుమారుడు, హీరో మనోజ్ ప్రేమ పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు సతీమణి విరానిక క్లాస్‌మెట్ ప్రణతితో మంచుమనోజ్ ప్రేమలో పడ్డారు. బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ప్రణతి ఆ తర్వాత యూఎస్‌లో ఉన్నత చదువులు చదువుకున్నారు. ఇక వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతోపాటు ఎంగేజ్‌మెంట్‌కు కూడా ముహుర్తం ఖరారు చేశారు. వచ్చే మార్చి 4న ఉదయం 10.30 గంటలకు ఓ స్టార్ హోటల్‌లో మనోజ్ ఎంగేజ్‌మెంట్ జరగనుంది. దీనికి అత్యంత సన్నిహితులతోపాటు పలువురు రాజకీయ నాయకులను మోహన్‌బాబు ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఎంగేజ్‌మెంట్ అనంతరం వీలైనంత త్వరగా పెళ్లి బాజా కూడా మోగించాలని ఇరు కుటుంబాల సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం.