హాస్యాస్పదంగా ఉంది : రాధిక ఆప్టే


'లెజెండ్' చిత్రంలో బాలకృష్ణ సరసన నటించిన రాధిక ఆప్టే న్యూడ్ సెల్ఫీలు అంటూ గత రెండు రోజుల నుండి ఇంటర్నెట్లో కొన్ని ఫోటోలు హాల్ చల్ చేస్తున్నాయి. వీటిపై మొదట మౌనం వహించిన రాధిక.. ఎట్టకేలకు స్పందించింది. 

ప్రజలకు ఇంత ఖాళి ఎక్కడ ఉందొ అర్ధం కావడం లేదు. వారు చేస్తున్న పనులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంటర్నెట్లో ఏవో ఫోటోలు చూపించి నావేననడం హాస్యాస్పదంగా ఉంది. వాటి గురించి పట్టించుకునే తీరిక నాకు లేదు. పెద్దగా భాదపడడం లేదు. 
షూటింగ్ నిమిత్తం ఇతర నగరానికి వెళ్ళిన నేను, రెండు రోజుల క్రితం బొంబాయి వచ్చాను. ప్రతి ఒక్కరి వద్ద నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇంటర్నెట్ లో ఆ న్యూడ్ పిక్చర్స్ చూసి నేను, నా ఫ్రెండ్స్ నవ్వుకున్నాం. ఫన్నీగా ఉంది. 
కొందరు లీగల్ యాక్షన్ తీసుకుంటావా..? అని అడుగుతున్నారు. నాకు అటువంటి ఉద్దేశం లేదు. ఎవరో ఒకరి ఫోటో మార్ఫింగ్ చేసి ఇంటెర్నెట్లో పోస్ట్ చేశారు. అవి నావే అంటున్నారు. ఇలాంటి విషయాలకు నేను ప్రాధాన్యత ఇవ్వను. పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం, కేసు పెట్టడం వృధా ప్రయాస. నా జీవితంలో వారి కోసం ఒక్క సెకన్ కూడా వృధా చేయదలుచుకోలేదు అని రాధిక ఆప్టే చెప్పారు.
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES