Advertisement
Google Ads BL

ధనుష్‌, కె.వి.ఆనంద్‌ల ‘అనేకుడు’ ఆడియో లాంచ్‌


‘రంగం’ చిత్రంతో దర్శకుడుగా తెలుగులోనూ పెద్ద విజయాన్ని సాధించిన కె.వి.ఆనంద్‌, ఇటీవల ‘రఘువరన్‌ బి.టెక్‌’ చిత్రంతో హీరోగా సూపర్‌హిట్‌ అందుకున్న ధనుష్‌ కాంబినేషన్‌లో ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కల్పాత్తి ఎస్‌.అఘోరం, కల్పాత్తి ఎస్‌.గణేష్‌, కల్పాత్తి ఎస్‌.సురేష్‌ నిర్మించిన చిత్రం ‘అనేకుడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లోని సినీమాక్స్‌ థియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ఆడియోను ఆవిష్కరించి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న ప్రముఖ నిర్మాత, ఫిలింఛాంబర్‌ అధ్యక్షుడు ఎన్‌.వి.ప్రసాద్‌కి అందించారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌, రెండు పాటలను పాత్రికేయుల కోసం ప్రదర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో ధనుష్‌, హీరోయిన్లు అమైరా దస్తూర్‌, ఐశ్వర్య దేవన్‌, చిత్ర దర్శకుడు కె.వి.ఆనంద్‌సి.అశ్వనీదత్‌, సి.కళ్యాణ్‌, దామోదరప్రసాద్‌, నల్లమలుపు బుజ్జి, కొడాలి వెంకటేశ్వరరావు, ఠాగూర్‌ మధు, మల్టీడైమెన్షన్‌ వాసు, ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ రంగరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

సి.అశ్వనీదత్‌: నాకు కె.వి.ఆనంద్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌. ఈ చిత్రానికి సంబంధించి నాకు వున్న అనుబంధం ఏమిటంటే ఈ కథ మొదట నాకే వినిపించారు కె.వి.ఆనంద్‌. చాలా ఫెంటాస్టిక్‌గా వుందనిపించింది. ఇప్పుడు ట్రైలర్‌, సాంగ్స్‌ చూస్తుంటే నాకు చెప్పినదానికంటే బాగా తీశారనిపించింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని నేను కూడా అందరితోపాటు ఎదురుచూస్తున్నాను. 

సి.కళ్యాణ్‌: ట్రైలర్‌ ట్రెమండస్‌గా వుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. కె.వి.ఆనంద్‌గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అనిపించుకున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో వచ్చే సినిమాలు చేసే ధనుష్‌కి ఇలాంటి సినిమా చేయడం అంటే చాలా ఇష్టం. తమిళ్‌లో ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది చాలా పెద్ద సంస్థ. ఖర్చుకు వెనకాడకుండా సినిమా బాగా రావడం కోసం ఎంత బడ్జెట్‌ అయినా పెడతారు. ఈ సినిమా తమిళ్‌తోపాటు తెలుగులో కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 

ఎన్‌.వి.ప్రసాద్‌: ధనుష్‌ మొదటి సినిమా ధూల్‌పేట తెలుగులో మేమే రిలీజ్‌ చేశాం. అలాగే కె.వి.ఆనంద్‌గారి రంగం చిత్రాన్ని కూడా మేమే రిలీజ్‌ చేశాం.  ధనుష్‌, కె.వి.ఆనంద్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా అంటే తమిళ్‌లోనే కాదు, తెలుగులోనూ మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమాని కూడా తెలుగులో మేమే రిలీజ్‌ చేస్తున్నాం. అఘోరంగారికి తమిళ్‌తోపాటు తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను.

వనమాలి: రంగంలో అన్ని పాటలూ నేనే రాశాను. బ్రదర్స్‌లో కూడా రాశాను. ఇప్పుడు ఈ సినిమాలో కూడా పాటలు రాసే అవకాశం ఇచ్చారు కె.వి.ఆనంద్‌గారు. ఆయన ప్రతి వాక్యానికి అర్థం తెలుసుకొని ఎంతో ఎంజాయ్‌ చేస్తూ పాటలు రాయించుకుంటారు. ‘అనేకుడు’ ధనుష్‌గారిని మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా అవుతుంది. తమిళ్‌లో ఆయనకు అభిమానులు వున్నట్టే ఆయన చేస్తున్న సినిమాల ద్వారా తెలుగులో కూడా అభిమానులు పెరుగుతున్నారు. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుంది.

దామోదరప్రసాద్‌: కామన్‌ మ్యాన్‌కి దగ్గరగా వుండే ఆర్టిస్ట్‌ ధనుష్‌గారు. సౌత్‌లోనే కాదు నార్త్‌లో కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. రియలిస్టిక్‌గా వుండే సినిమాలు చేస్తారు కాబట్టి ఆయన ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మంచి హిట్‌ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను.

రంగరాజన్‌: తమిళ్‌లో మేం నిర్మించిన అనేగన్‌ చిత్రాన్ని తెలుగులో అనేకుడుగా రిలీజ్‌ చేయడం చాలా సంతోషంగా వుంది. ధనుష్‌గారికి తెలుగులో ఇది ఒక మైలురాయిలాంటి సినిమాగా, ఒక కలికితురాయిగా మిగిలిపోతుందన్న నమ్మకం మాకు వుంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ ఫంక్షన్‌కి విచ్చేసిన అతిథులందరికీ థాంక్స్‌ చెప్తున్నాను. 

అమైరా దస్తూర్‌: ఈ సినిమాకి వర్క్‌ చేయడం గ్రేట్‌ ప్లెజర్‌గా ఫీల్‌ అవుతున్నాను. నా కెరీర్‌లో ఎర్లీ డేస్‌లోనే ధనుష్‌, కె.వి.ఆనంద్‌గారి కాంబినేషన్‌లో సినిమా చేయడం చాలా గర్వంగా వుంది. ఇందులో డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేశాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. 

ఐశ్వరదేవన్‌: నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కె.వి.ఆనంద్‌గారికి థాంక్స్‌. నాకు సపోర్ట్‌ చేసిన యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకి సంబంధించి స్టోరీ అనేది సర్‌ప్రైజింగ్‌గా వుంటుంది. ఇందులోని సస్పెన్స్‌ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తుంది. ధనుష్‌గారు చాలా హంబుల్‌ పర్సన్‌. ఆయనతో కలిసి నటించడం ఒక మెమరబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌.

వి.వి.వినాయక్‌: వైజాగ్‌లోని మా విమాక్స్‌ థియేటర్‌లో రఘువరన్‌ బి.టెక్‌ ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది. మా థియేటర్‌ స్టార్ట్‌ అయింది కె.వి.ఆనంద్‌గారి ‘రంగం’ చిత్రంతో. రంగంలాంటి కథని డీల్‌ చేయడం చాలా కష్టం. సినిమాలో ఎక్కడా లాజిక్‌ మిస్‌ అవకుండా సినిమాని అద్భుతంగా తీశారు. ఇప్పుడు ‘అనేకుడు’ ట్రైలర్‌ చూస్తుంటే అసలు స్టోరీ ఏమై వుంటుంది అనేది తెలియడం లేదు. తప్పకుండా ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

కె.వి.ఆనంద్‌: ఇంతకుముందు డిఫరెంట్‌ ఇష్యూస్‌ మీద సినిమాలు తీశాను. కానీ, ఇది రొమాంటిక్‌ లవ్‌స్టోరీ. డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో రన్‌ అవుతుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో 35 రోజులు షూటింగ్‌ చేశాం. హేరిస్‌ జైరాజ్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చాడు. అలాగే రీరికార్డింగ్‌ కూడా బాగా చేశాడు. సినిమా చూశాం. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాని బాగా తియ్యడంలో ప్రొడ్యూసర్స్‌ సపోర్ట్‌ ఎంతో వుంది. ఒక టైమ్‌ లిమిట్‌ అనేది పెట్టకుండా శాటిస్‌ఫై అయ్యేవరకు తియ్యమన్నారు. అప్పుడే సినిమా రిలీజ్‌ చేద్దామని నాకు ఫ్రీడమ్‌ ఇచ్చారు. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం నాకు వుంది.

ధనుష్‌: నాకు స్క్రిప్ట్‌ నచ్చితే కొత్త డైరెక్టర్‌ అయినా సినిమా చేస్తాను. కె.వి.ఆనంద్‌గారి స్క్రిప్ట్‌ నాకు బాగా నచ్చింది. ఇందులో నేను నాలుగు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేశాను. ఒక మనిషిలోని నాలుగు డిఫరెంట్‌ షేడ్స్‌ ఈ సినిమాలో చూడొచ్చు. ఈమధ్య రిలీజ్‌ అయిన రఘువరన్‌ని చాలా పెద్ద హిట్‌ చేశారు. మీరు ఇస్తున్న ఎంకరేజ్‌మెంట్‌తో ఇంకా మంచి సినిమాలు చెయ్యాలని వుంది. ఈనెల 20న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 

ధనుష్‌, అమైరా దస్తూర్‌, ఐశ్వర్యదేవన్‌, కార్తీక్‌, ఆశిష్‌ విద్యార్థి, ముఖేష్‌ తివారి, అతుల్‌ కులకర్ణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, కథ, స్క్రీన్‌ప్లే: కె.వి.ఆనంద్‌, శుభ, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: సాహితి, వనమాలి, కెమెరా: ఓంప్రకాష్‌, ఎడిటింగ్‌: ఆంథోని, ఆర్ట్‌: డి.ఆర్‌.కె.కిరణ్‌, ఫైట్స్‌: కనల్‌కణ్ణన్‌, డాన్స్‌: రాజుసుందరం, బాబా భాస్కర్‌, నిర్మాతలు: కల్పాత్తి ఎస్‌.అఘోరం, కల్పాత్తి ఎస్‌.గణేష్‌, కల్పాత్తి ఎస్‌.సురేష్‌, దర్శకత్వం: కె.వి.ఆనంద్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs