Advertisement
Google Ads BL

తల్లి పాత్రకే పరిమితమవుతున్న హాట్‌ హీరోయిన్‌..!!


అమలాపాల్‌.. తెలుగులో కొన్ని చిత్రాలతోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను దక్కించుకుంది. అంతలోనే తమిళ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది ఈ అమ్మడు. ఇక గతేడాది జూన్‌లో వివాహం చేసుకున్నప్పటినుంచి కూడా అమలాపాల్‌ ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే తాను సినిమాల్లో నటించినా తనకు అభ్యంతరం లేదని, అయితే గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉండాలన్న భర్త సూచన మేరకు ఎట్టకేలకు ఓ సినిమాను అంగీకరించింది. హీరో సూర్య నిర్మాతగా మారి తమిళంలో ఓ బాలల చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మూడు జంటలు, వారి పిల్లల కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య, అమలాపాల్‌ ఓ జంటగా నటిస్తున్నారు. ఈ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ప్రభావం మాత్రం కొన్నేళ్లపాటు నిలిచిపోయే ఉంటుందని అమలాపాల్‌ చెబుతోంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs