Advertisement
Google Ads BL

శరవేగంగా వరా ముళ్ళపూడి చిత్రం షూటింగ్‌


దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బి.ఎ. సమర్పణలో, ఎమ్‌.ఎమ్‌. కీరవాణీ సంగీత దర్శకత్వంలో స్వర్గీయ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ కుమారుడైన వరా ముళ్ళపూడి కథ, దర్శకత్వాన, ఎస్‌.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపైన యువ నిర్మాతలు జి.అనిల్‌కుమార్‌ రాజు, జి.వంశీకృష్ణలు కలిసి ఈతరం ప్రేక్షకులు ఏ తరహా కథా చిత్రాలను మెచ్చుచున్నారో.. అవిధమైన ఓ మంచి కథతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాతలు జి. అనిల్‌ కుమార్‌ రాజు, జి. వంశీకృష్ణలు మాట్లాడుతూ..‘ఇదొక అందమైన గ్రామీణ ప్రేమకథా చిత్రం. ఈ చిత్రాన్ని స్వర్గీయ శ్రీ ముళ్ళపూడి వెంకరమణగారి తనయుడైన వరా ముళ్ళపూడి దర్శకత్వంలో మేము నిర్మిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. బొబ్బిలి రాజ్‌మహల్‌ ప్యాలెస్‌ పాటు, బొబ్బిలి సమీప పాంతాల్లో జనవరి 30 నుండి 45 రోజుల పాటు ఏకధాటిగా చేసే షూటింగ్‌తో పాటల చిత్రీకరణ మినహా టాకీ మొత్తం పూర్తి అవుతుంది.’ అని చెప్పారు. చిత్ర దర్శకుడు వరా ముళ్ళపూడి చెబుతూ..‘ ఇంత వరకు ప్రేమకథా చిత్రాలు మనకు వెండితెర మీద చాలా వచ్చాయి. ఎన్నింటినో చూశాము. అయితే రొటీన్‌ ప్రేమకథగా కాకుండా ఆద్యంతం కొత్తగా సాగేటువంటి అచ్చమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రమిది. బొబ్బిలి రాజ్‌మహల్‌ ప్యాలెస్‌లోనూ, బొబ్బిలి సమీపంలోని గ్రామాల్లోనూ ఈ చిత్రాన్ని ఏకధాటిగా ఒకే షెడ్యూల్‌లో షూటింగ్‌ చేసి, పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి ప్రముఖ సంగీత దర్శకులైన ఎమ్‌.ఎమ్‌. కీరవాణి చాలా మంచి పాటలు చేశారు. శివశక్తి దత్తా, అనంత్‌ శ్రీరామ్‌లు చక్కని సాహిత్యాన్ని సమకూర్చారు..’ అని అన్నారు. లనఅఐఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ ఫేమ్‌ సుథాకర్‌ కోమాకుల, సుధీర్‌వర్మ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. నాగినీడు, రాజీవ్‌ కనకాల, శేఖర్‌, రaాన్సీ, మధుమణి, షాని, గాయిత్రి భార్గవి, ఆలపాటి లక్ష్మీ మున్నగువారు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఎమ్‌.ఎమ్‌.కీరవాణి, పాటలు: శివశక్తి దత్తా, అనంత్‌ శ్రీరామ్‌, సమర్పణ: కె. రాఘవేంద్రరావు బి.ఎ., నిర్మాతలు : జి. అనిల్‌కుమార్‌ రాజు, జి.వంశీకృష్ణ కథ, దర్శకత్వం: వరా ముళ్ళపూడి

Advertisement
CJ Advs

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs