వరసగా విజయాల్ని సాధిస్తున్న యంగ్‌హీరో ధనుష్ కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం ‘అనేకుడు’ సూపర్‌గుడ్ సంస్థ అందించిన ‘రంగం’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన దర్శకుడు కె.వి.ఆనంద్ దీన్ని తెరకెక్కించారు. కల్పాత్తి.ఎస్, అగోరం సమర్పణలో, ఎ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని ముగించుకొని సోని మ్యూజిక్ ద్వారా ఫిబ్రవరి 10న చలన చిత్రప్రముఖల నడుమ అత్యంత భారీ ఎత్తున్న ఆడియో విడుదల సంబంరం జరుగుతుంది. చిత్ర దర్శకుడు కె.వి.ఆనంద్ ‘ అనేకుడు గురించి చెబుతూ ‘ నేటి తరం యువతరానికి కావలిసిన అన్ని అంశాల్ని పొందుపరిచి అనేకుడుని తెరకెక్కింయడం జరిగింది. అలాగే నేటి యూత్ మెచ్చే మంచి పాటల్ని పొందుపరిచి అనేకుడని తెరకెక్కింయడం జరిగింది. అలాగే నేటి యూత్ మెచ్చే మంచి పాటల్ని హారిష్ జైరాజ్ సమకుర్చారు. కమర్షియల్ విలువలతో అన్ని తరగతుల వారు ఆనందించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఆడియోని ఫిబ్రవరి 10న విడుదల చేసి సినిమాని అతిత్వరలో... ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది.’ అని చెప్పారు. ధనుష్ సరసన అమైరా దస్తూర్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో కార్తిక్, ఐశ్వర్య, ఆశీష్‌విద్యార్ధి, అతుల్ కులకర్ణి మున్నగువారు యితర పాత్రలను పోషించారు. హారీష్‌జైరాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి పాటలు సాహితి, వనమాలి, చాయాగ్రహణం ఔం ప్రకాష్, ఎడిటింగ ఆంథోని, పని చేసిన సాంకేతిక వర్గం నిర్మాతలు కల్పాత్తి ఎస్. అఘోరం, కల్పాత్తి ఎస్. గణేష్, ఎస్, కల్పాత్తి సురేష్ స్క్రీన్ ప్లే దర్శకత్వం కె.వి.ఆనంద్