Advertisement
Google Ads BL

40ఏళ్ల తర్వాత విడుదలవుతున్న సినిమా..!!


బాలీవుడ్‌ అల్‌టైవమ్‌ గ్రేట్‌ హిట్స్‌లో 'షోలే' టాప్‌ పోజిషన్‌లో ఉంటుంది. రమేష్‌ సిప్పీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్‌లో వండర్లు క్రియేట్‌ చేసింది. అదే సమయంలో బిగ్‌-బీ అమితాబ్‌బచ్చన్‌ కెరియర్‌కు ఈ సినిమానే పునాదిగా నిలిచిందని కూడా చెప్పవచ్చు. అయితే 1975లో వచ్చిన ఈ సినిమాను ఇప్పటివరకు పాకిస్తాన్‌లో మాత్రం విడుదల చేయలేదు. ఈ సినిమా విడుదల సమయంలో రెండు దేశాల మధ్య ఉన్న టెన్షన్స్‌కు 'షోలే' పాకిస్తాన్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి నోచుకోలేకపోయింది. అయితే ఇన్నాళ్లకు ఈ సినిమాను ఇప్పుడు పాక్‌లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 23 నుంచి ఈ సినిమాను 2-డీ, 3-డీ విభాగాల్లో పాక్‌లో ప్రదర్శించనున్నారు. మరి 40 ఏళ్ల తర్వాత షోలే సినిమా ఎలాంటి వండర్లు క్రియేట్‌ చేస్తుందో వేచిచూడాల్సిందే.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs