Advertisement
Google Ads BL

'అనగనగా ఒక చిత్రం' మూవీ లంచ్..!


గోవర్షిణి ఫిలిమ్స్ ఆధ్వర్యంలో జె.ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'అనగనగా ఒక చిత్రం'. జె.ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. శివ, మేఘశ్రీ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ నివ్వగా, ఎస్.గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు జె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ "ప్రేమకథా చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాను స్పూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. హీరో శివ నటించిన మొదటి సినిమాను చూసాను. చాలా అధ్బుతంగా చేసాడు. ఈ సినిమా కూడా ఆయనకీ ప్లస్ పాయింట్ అవుతుంది. ఇదొక టిపికల్, లవ్ కమ్ థ్రిల్లర్ స్టొరీ. హై టెక్నికల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం" అని చెప్పారు.

ప్రొడ్యూసర్ కొడాలి సుబ్బారావు మాట్లాడుతూ "రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 9 వ తారీఖు నుండి  జరపనున్నాం. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు. 

హీరో శివ మాట్లాడుతూ "నేను నటించిన మొదటి సినిమా 'జగన్' కమర్షియల్ గా ఎంత హిట్ అయ్యిందో ఈ సినిమా కూడా అలాగే హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

హీరోయిన్ మేఘశ్రీ మాట్లాడుతూ "తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి నా ధన్యవాదాలు" అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ స్వరాజ్ మాట్లాడుతూ "ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. 4 మెయిన్ సాంగ్స్, 2 బిట్ సాంగ్స్. మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs