Advertisement
Google Ads BL

ఫిబ్రవరి 14న ‘పడ్డానండి ప్రేమలో మరి’


వరుణ్‌ సందేశ్‌, వితిక షేరు జంటగా నల్లపాటి వంశీమోహన్‌ సమర్పణలో పాంచజన్య మీడియా ప్రై. లిమిటెడ్‌ పతాకంపై మహేష్‌ ఉప్పుటూరి దర్శకత్వంలో నల్లపాటిరామచంద్రప్రసాద్‌ నిర్మించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘పడ్డానండి ప్రేమలో మరి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా గురువారం ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వరుణ్‌ సందేశ్‌, హీరోయిన్‌ వితిక షేరు, దర్శకుడు మహేష్‌ ఉప్పుటూరి, నిర్మాత నల్లపాటి రామచంద్రప్రసాద్‌, నటుడు అరవింద్‌ పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

నల్లపాటి రామచంద్రప్రసాద్‌: మా చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అలాగే సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ పొందింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే రోజున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఫిబ్రవరి 14న ప్రేక్షకులు ఒక మంచి సినిమాని చూడబోతున్నారు. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులు హండ్రెడ్‌ పర్సెంట్‌ హ్యాపీగా ఫీల్‌ అవుతారని ఘంటాపథంగా చెప్పగలను. ఇప్పటివరకు వరుణ్‌ సందేశ్‌ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా వుండే సినిమా ఇది. మలేషియాలో చేసిన రెండు పాటలు అద్భుతంగా వచ్చాయి. ఇటీవల విడుదలైన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే ట్రైలర్‌ కూడా అందరికీ బాగా నచ్చింది. ఈ సినిమా విషయంలో అందరి నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.

వరుణ్‌ సందేశ్‌: ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఫిబ్రవరి 14న థియేటర్‌కి రండి. మీరు కూడా ప్రేమలో పడండి. హ్యాపీడేస్‌, కొత్తబంగారులోకం, ఏమైంది ఈవేళ చిత్రాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకం నాకు వుంది. డైరెక్టర్‌ మహేష్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా తీశారు. ఈ చిత్రంలో లంకపతిగా అరవింద్‌ చాలా మంచి క్యారెక్టర్‌ చేశాడు. అలాగే అలా మొదలైంది చిత్రంలో తాగుబోతు రమేష్‌ చేసిన క్యారెక్టర్‌లా ఈ చిత్రంలో మరో అద్భుతమైన క్యారెక్టర్‌ చేశాడు. ఆ క్యారెక్టర్‌ నుంచి హిలేరియస్‌ కామెడీ వస్తుంది. నిర్మాత రాముగారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇలాంటి మంచి ప్రొడక్షన్‌ చేసిన సినిమా హిట్‌ అయితే వారి నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయి.

వితిక షేరు: ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్‌ చేశాను. మొదటి రోజు నుంచి యూనిట్‌లోని అందరి సహకారం నాకు వుంది. ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌ పేరు శ్రావణి. లవ్‌ డిస్ట్రబెన్స్‌ వల్ల ఎంతమంది విడిపోతున్నారు అనే మంచి కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో లవ్‌తోపాటు యాక్షన్‌, కామెడీ అన్నీ వుంటాయి. 

అరవింద్‌: సినిమా చాలా బాగా వచ్చింది. నిన్న ఈ సినిమాని మేమంతా చూశాం. తప్పకుండా ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్‌ వచ్చింది. ఒక మంచి సినిమా చేశామన్న తృప్తి మాకు కలిగింది.

మహేష్‌ ఉప్పుటూరి: ఇది ఒక రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. ఒక మంచి కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. నిర్మాత రామచంద్రప్రసాద్‌గారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమా బాగా రావడానికి కోఆపరేట్‌ చేశారు. ఇందులో వరుణ్‌ సందేశ్‌ క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. సేమ్‌ టైమ్‌ ప్రతి ఒక్కరికీ ఆ క్యారెక్టర్‌ కనెక్ట్‌ అవుతుంది. మంచి లవ్‌ సీన్స్‌తోపాటు యాక్షన్‌, కామెడీ అన్నీ ఇందులో వున్నాయి. ఇందులో నటించిన ఆర్టిస్టులు అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. మంచి ఔట్‌పుట్‌ రావడంలో ఆర్టిస్టులతోపాటు టెక్నీషియన్స్‌ కృషి కూడా ఎంతో వుంది. ఖుద్దూస్‌ చేసిన మ్యూజిక్‌ సినిమాకి చాలా ప్లస్‌ అవుతుంది. ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. దానికి తగ్గట్టుగానే విజువల్‌గా కూడా ఈ పాటలు చాలా గ్రాండ్‌గా వచ్చాయి. ఫిబ్రవరి 14న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని పెద్ద హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను.

వరుణ్‌ సందేశ్‌, వితిక షేరు, ఎం.ఎస్‌.నారాయణ, పోసాని కృష్ణమురళి, తెలంగాణ శకుంతల, పృథ్వి, తాగుబోతు రమేష్‌, నల్ల వేణు, కాశీ విశ్వనాథ్‌, రక్ష, అరవింద్‌, హేమంత్‌, సోనీ, పీలా గంగాధర్‌, హేమంతిని, అనంత్‌, రాఘవేంద్ర, చంటి, రామ్‌ప్రసాద్‌, శేషుకుమార్‌, సాయి నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.ఖుద్దూస్‌, సినిమాటోగ్రఫీ: భరణి కె.ధరన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, ఫైట్స్‌: రవి, డాన్స్‌: స్వర్ణ, ప్రదీప్‌ ఆంటోనీ, పాటలు: చైతన్యప్రసాద్‌, ఆర్ట్‌: కుమార్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: భీమనేని రాయుడు, సమర్పణ: నల్లపాటి వంశీమోహన్‌, నిర్మాత: నల్లపాటి రామచంద్రప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్‌ ఉప్పుటూరి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs