Advertisement

ఆఖరి షెడ్యూల్‌లో ‘ఆమె ఎవరు?'


కోరుకొండ  శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో శ్రీ బాలగణపతి ప్రొడక్షన్స్‌ సమర్పణలో   శ్రీ సాయిదుర్గా చిత్రాలయ పతాకంపై రూపొంతున్న చిత్రం ‘ఆమె ఎవరు?’. అనీల్‌ కళ్యాన,్‌ మిత్ర హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్‌ ప్రధానపాత్ర పోషిస్తుంది. వీరగణేష్‌ కర్రి, లక్ష్మీ సరోజ నిర్మాతలు. రమేష్‌ ముగడ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ జరుపుకుంటోంది. 

Advertisement

ఈ సందర్భంగా నిర్మాత వీరగణేష్‌ కర్రి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం మా చిత్రం ఆఖరి షెడ్యూల్‌ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో కొంత  టాకీ పార్ట్‌తో పాటు సాంగ్స్‌ కూడా పిక్చరైజ్‌ చేయనున్నాము. మా సినిమాలో ఎమ్మెస్‌ నారాయణగారు ఆయర్వేద కళాశాల ప్రిన్సిపాల్‌గా అద్భుతమైన పాత్రలో నటించారు. వారి పాత్ర సినిమాకు ప్రాణం. ఇటీవల మా సినిమాకు సంబంధించి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ...మా సంస్థ గురించి.. మా దర్శకుడు గురించి చాలా చక్కగా చెప్పడమే కాకుండా నాకు ఎన్నో సలహాలు, సూచనలు అందిస్తూ అన్ని విధాల మాకు ఎంతో సహకరించారు. వారి మంచి తనం గురించి ఎంతో విన్నాను. కానీ మా సినిమా సమయంలో దగ్గర నుంచి చూశాను. పెద్ద  నిర్మాతలకే కాకుండా మా లాంటి చిన్న నిర్మాతలకు కూడా వారు అందుబాటులో ఉంటూ ఎస్‌...ఎమ్మెస్‌ అందరివాడు అనిపించుకున్నారు. అలాంటి గొప్ప వ్వక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారి అకాల మరణానికి చింతిస్తూ...వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు.

దర్శకుడు రమేష్‌ ముగడ మాట్లాడుతూ ‘‘ హారర్‌ కామెడీ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతంది. ఎమ్మెస్‌ నారాయణ గారి ప్రోత్సాహం నాలో చాలా ఉత్సాహాన్ని నింపింది. దర్శకులకు కంఫర్ట్‌బుల్‌గా ఉండే నటుడాయన. అలాంటి నటుడును కోల్పోవడం చాలా దురదృష్టం అన్నారు.

చలపతిరావు, కాదంబరి కిరణ్‌, ధన్‌రాజ్‌, నల్లవేణు, సైదులు, అల్లరి సుభా షిణి, అపూర్వ, పి.యస్‌.కుమార్‌, రజిత తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ఆర్‌.కె., ఫైట్స్‌: నాగరాజు, ఎడిటర్‌: మేనగ శ్రీను, కెమెరా: సేనాపతి, మాటలు: ఆర్‌.ఫణీంద్ర, ఓం ప్రసాద్‌ వాకాటి, పాటలు: రామ్‌ పైడిశెట్టి, సురేష్‌ గంగుల, కైలాస్‌ బొమ్మాళి, ఐటెం రాజు, కొరియోగ్రఫీ: చార్లీ, సంగీతం: చిన్నికృష్ణ, నిర్మాతలు: వీరగణేష్‌ కర్రి, లక్ష్మీ సరోజ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్‌ ముగడ.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement