Advertisement
Google Ads BL

ఫిబ్రవరి 14న ‘భమ్‌ భోలేనాథ్‌’


నవదీప్‌, నవీన్‌చంద్ర హీరోలుగా, పూజ హీరోయిన్‌గా ఆర్‌.సి.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కార్తీక్‌వర్మ దండు దర్శకత్వంలో శిరువూరి రాజేష్‌వర్మ నిర్మించిన ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ‘భమ్‌ బోలేనాథ్‌’. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌ డే సందర్భంగా రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హీరోలు  నవదీప్‌, నవీన్‌ చంద్ర, తాగుబోతు రమేష్‌, కిరీటి, నిర్మాత శిరువూరి రాజేష్‌వర్మ, కార్తీక్‌వర్మ దండు పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

నవదీప్‌: మా ‘భమ్‌ బోలేనాథ్‌’ సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు కూడా సినిమా చాలా బాగుందని, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అని చెప్పారు. ఆల్రెడీ ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. ముఖ్యంగా టైటిల్‌ సాంగ్‌, డూయెట్‌ సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ కోసం ఈమధ్య విజయవాడ, గుంటూరు, తిరుపతి, చిత్తూరు సెంటర్స్‌కి వెళ్ళడం జరిగింది. దాదాపు 6 వేల మంది స్టూడెంట్స్‌కి ఈ చిత్రం ట్రైలర్‌ చూపించాం. వాళ్ళు చాలా ఎక్సైట్‌ అయ్యారు. ఈ చిత్రానికి ఒక రేంజ్‌లో పబ్లిసిటీ చేస్తున్నారు మా నిర్మాత. నాకు, నవీన్‌కి చాలా మంచి ఓపెనింగ్స్‌ వస్తాయని భావిస్తున్నాను. సినిమాకి చాలా మంచి పాజిటివ్‌ టాక్‌ వుంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.

నవీన్‌చంద్ర: ఆడియో చాలా మంచి హిట్‌ అయింది. అలాగే టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడెంట్సే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా చూసి ఎంజాయ్‌ చేసే విధంగా వుంటుంది. ఫిబ్రవరి 14న అందరూ థియేటర్స్‌లో మా చిత్రాన్ని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

తాగుబోతు రమేష్‌: టైటిల్‌ చూసిన ప్రతి ఒక్కరూ చాలా డిఫరెంట్‌గా వుందని అప్రిషియేట్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌లో పెద్ద  పెద్ద స్టార్స్‌ అంతా కలిసి సినిమాలు చేస్తారు. అలా ఈ సినిమాని కూడా ఇద్దరు హీరోలతో అద్భుతంగా చేశారు. సినిమా డిఫరెంట్‌గా వుందని చెప్పడం మామూలైపోయింది. కానీ, ఈ సినిమా నిజంగానే డిఫరెంట్‌గా వుంటుంది. ఇది ఒక డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో చేసిన సినిమా. మూడు కథలు వుండే ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ లేకపోతే అసలు స్క్రీన్‌ప్లేయే లేదు అన్నట్టుగా వుంటుంది. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. 

కిరీటి: ఉయ్యాల జంపాల తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ప్రోమోస్‌, పోస్టర్స్‌ చూసి నా ఫ్రెండ్స్‌ ఫోన్‌ చేసి ఇందులో నువ్వు గే క్యారెక్టర్‌ చేస్తున్నావా అని అడుగుతున్నారు. నాది గే క్యారెక్టర్‌ కాదు. ఒక డిఫరెంట్‌గా వుండే క్యారెక్టర్‌. నాక్కూడా ఈ సినిమాలో గర్ల్‌ఫ్రెండ్‌ వుంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసే సినిమా ఇది.

కార్తీక్‌వర్మ దండు: ఈ సినిమాకి అద్భుతమైన ప్రమోషన్‌ చేస్తున్న రాజేష్‌వర్మగారికి థాంక్స్‌ చెప్పాలి. నేను రాసుకున్న కథ, తీసుకున్న సినిమాకి అంత మార్కెట్‌ లేదన్న సంగతి నాకు తెలుసు. కానీ, మా నిర్మాతగారు అన్నీ బ్యాలెన్స్‌ చేసుకొని చేద్దాం అని నన్ను ఎంకరేజ్‌ చేశారు. ఈ రేంజ్‌ సినిమా పబ్లిసిటీ కోసం ఇంత ఖర్చు పెడుతున్నారంటే మా నిర్మాతగారికి సినిమా మీద  వున్న నమ్మకమే కారణం. అందర్నీ ఎంటర్‌టైన్‌ చేసే సినిమా ఇది. ఇందులో చాలా డీసెంట్‌ కామెడీ వుంటుంది. ఎవరికీ చిరాకు పుట్టించదు. అంతవరకు నేను గ్యారెంటీ. 

శిరువూరి రాజేష్‌వర్మ: కార్తికేయ మా మొదటి సినిమా. ఆ సినిమాని చాలా పెద్ద హిట్‌ చేశారు. అందుకే మళ్ళీ ఈ సినిమాకి కూడా డిఫరెంట్‌ జోనర్‌ని సెలెక్ట్‌ చేసుకొని చేశాం. డిఫరెంట్‌ జోనర్‌లో సినిమా చేస్తే డెఫినెట్‌గా ఆడియన్స్‌ హిట్‌ చేస్తారని ‘కార్తికేయ’ ప్రూవ్‌ చేసింది. అదే డిఫరెంట్‌ జోనర్‌లో రెండు గంటలపాటు ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడం కోసం ఈ సినిమాని చేశాం. ఈ సినిమా బాగా రావడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఎంతో కోఆపరేట్‌ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించి మా అందరికీ పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.

నవదీప్‌, నవీన్‌చంద్ర, పూజ, ప్రదీప్‌, పోసాని కృష్ణమురళి, పంకజ్‌కేసరి, ప్రాచి, శ్రేయ, కిరీటి, ప్రవీణ్‌, నవీన్‌, రఘు పెన్మెత్స, తాగుబోతు రమేష్‌, ధనరాజ్‌, కాదంబరి కిరణ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: భరణి కె.ధరన్‌, డాన్స్‌: విజయ్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, మాటలు: శరణ్‌ కొప్పిశెట్టి, కార్తీక్‌వర్మ దండు, అడిషనల్‌ డైలాగ్స్‌: నవదీప్‌, కో`ప్రొడ్యూసర్స్‌: రఘు పెన్మెత్స, కాకర్లపూడి రామకృష్ణ, యాడపల్లి తేజ, సమర్పణ: శ్రీకాంత్‌ దంతులూరి, నిర్మాత: శిరువూరి రాజేష్‌వర్మ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్‌వర్మ దండు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs