Advertisement
Google Ads BL

''గడ్డం గ్యాంగ్'' రిలీజ్ కు సిద్ధం..!


శివాని, శివాత్మిక మూవీస్ ఆధ్వర్యంలో జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్న సినిమా ''గడ్డం గ్యాంగ్". రాజశేఖర్, షీనా జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో రాజశేఖర్ మాట్లాడుతూ "ఎవడైతే నాకేంటి, గోరింటాకు సినిమాల తరువాత ప్రేక్షకులను మెప్పించే రీతిలో సినిమాను తీయలేకపోయాను. అందుకే చాలా రోజులు గ్యాప్ తీసుకొని ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమాను తీసాం. తమిళంలో నలన్ కుమార్ స్వామి అనే దర్శకుడు తీసిన ఈ సినిమా రైట్స్ సంపాదించి తెలుగులో 'గడ్డం గ్యాంగ్' పేరుతో నిర్మించాం. ఈ సినిమాకు హీరో స్క్రిప్ట్ అనే చెప్పాలి. డైరెక్టర్ సంతోష్ కి ఇది మొదటి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న దర్శకునిగా ఈ సినిమాను తీసారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమయిందంటే దానికి కారణం జీవితా నే. ఈ సినిమాలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలుస్తాయి" అని చెప్పారు. 

Advertisement
CJ Advs

దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ "నా మొదటి సినిమా రాజశేఖర్ గారితో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో రాజశేఖర్ ని చాలా కొత్తగా చూపించాం. డిఫరెంట్ జోనర్ లో చేసిన సినిమా ఇది. ఈ నెల 6 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం" అని అన్నారు.

నిర్మాత జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "సినిమా రైట్స్ నుండి రిలీజ్ కు తీసుకు వచ్చే వరకు చాలా కష్టపడి తీసాం. ఈ సినిమాలో పాత్రాలు ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటాయి" అని అన్నారు. 

సంగీత దర్శకుడు అచ్చు మాట్లాడుతూ "ఈ సినిమాకి సంగీతాన్ని అందించడంతో పాటు ఒక పాత్రలో కుడా నేను నటించాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs