Advertisement
Google Ads BL

'బెంగాల్ టైగర్' చిత్రం ప్రారంభం..!


రవితేజ, తమన్నా జంటగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై సంపత్ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం 'బెంగాల్ టైగర్'. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక ఈ రోజు హైదరాబాద్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి డైరెక్టర్ రాఘవేంద్ర రావు, వి.వి.వినాయక్, సురేందర్ రెడ్డి వంటి ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ "ఇప్పటివరకు నేను నిర్మించిన చిత్రాలకు పాత్రికేయ మిత్రులంతా చాలా  సపోర్ట్ చేసారు. ఈ చిత్రానికి కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇది ఓ ఎనర్జిటిక్ కమర్షియల్ ఎంటర్ టైనింగ్ సినిమా. దర్శకుడు సంపత్ నందితో 'ఏమైంది ఈ వేళా ' సినిమా చేసాము.  ఆయన  'రచ్చ' సినిమా తరువాత మూడవ చిత్రం మాతో చేయడం చాలా సంతోషంగా ఉంది. మార్చి 2 వ తేదీ  నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఏప్రిల్ నుండి నిర్విరామంగా షూటింగ్ జరపనున్నాము. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము" అని చెప్పారు.

హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ "రచ్చ సినిమా తరువాత సంపత్ నందితో ఈ సినిమా కోసం పని చేయడం చాలా సంతోషంగా ఉంది. రవితేజ తో ఎప్పటి నుంచో ఓ సినిమాలో నటించాలి అనుకుంటున్నా. ఈ చిత్రంతో నా కోరిక నెరవేరబోతోంది. షూటింగ్ ఎప్పుడు స్టార్ అవుతాదా అని వెయిట్ చేస్తున్నాను. రాశి ఖన్నా కూడా నటించనుండటంతో కాంబినేషన్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది". అని అన్నారు.

ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు క్లాప్ ఇవ్వగా, వి.వి.వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దర్శకుడు సురేంద్ర  రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs