Advertisement
Google Ads BL

‘ఎవడే సుబ్రమణ్యం’లోమాళవిక నాయర్‌


నాని హీరోగా స్వప్న సినిమా పతాకంపై నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రియాంక దత్‌ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. ఈ చిత్రం ద్వారా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. 2014లో తమిళ చిత్రం ‘కుక్కూ’లోని నటనకుగాను మాళవిక నాయర్‌ ఉత్తమ నూతన నటిగా ఎస్‌ఐసిఎ అవార్డు అందుకున్నారు. అలాగే వికటన్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ ఇదే చిత్రంలోని మాళవిక నటనకు ఉత్తమనటి అవార్డును అందించింది. 5 మలయాళ చిత్రాల్లో కూడా నటించిన మాళవిక ఇప్పుడు ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ‘ఐ’ చిత్రంతోపాటు ప్రదర్శించిన ‘ఎవడే సుబ్రమణ్యం’ ట్రైలర్‌కి కూడా మంచి స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత ప్రియాంక దత్‌. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs