Advertisement
Google Ads BL

ప్రేక్షకుల మధ్య ‘పటాస్‌’ సక్సెస్‌మీట్‌


నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘పటాస్‌’ చిత్రం ఇటీవల విడుదలై భారీ ఓపెనింగ్స్‌లో సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని సోమవారం హైదరాబాద్‌ ఆర్‌.టి.సి. క్రాస్‌ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య జరిగింది. ఈ సక్సెస్‌మీట్‌లో హీరో కళ్యాణ్‌రామ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి, దిల్‌రాజు, సాయికార్తీక్‌, సాయికుమార్‌, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

కళ్యాణ్‌రామ్‌: ఆడియన్స్‌ ఈ సినిమాని చాలా పెద్ద హిట్‌ చేశారు. అనిల్‌ రాఘవపూడి చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు. అలాగే దిల్‌రాజుగారు మాకు సపోర్ట్‌గా నిలిచారు. మా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌. 

దిల్‌రాజు: ఈ దేవి థియేటర్‌లోనే నరసింహనాయుడు, ఆది విజయవంతంగా రన్‌ అయ్యాయి. బాలకృష్ణగారికి నరసింహనాయుడు, ఎన్టీఆర్‌కి ఆది చితంలా కళ్యాణ్‌రామ్‌కి పటాస్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా చూసిన ప్రతి ఒకరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

సాయికుమార్‌:  కర్ణాటకలో కూడా ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఇంతకుముందు ఎన్టీఆర్‌గారితో మేజర్‌ చంద్రకాంత్‌, బాలకృష్ణగారితో రౌడీ ఇన్సెపెక్టర్‌ వంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించాను. ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌తో పటాస్‌లో నటించాను. ఇది కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది.  

అనిల్‌ రావిపూడి: కళ్యాణ్‌రామ్‌గారు నన్ను ఒక బ్రదర్‌లా నమ్మి నాకు మంచి సపోర్ట్‌ ఇచ్చారు. ఈ సినిమా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బేనర్‌లో రూపొందింది. ఆ పెద్దాయ ఆశీస్సులతో నేను ఇండస్ట్రీకి వచ్చినట్టుగా భావిస్తున్నాను. ఈ సినిమాతో నందమూరి అభిమానులకు మంచి ఫీస్ట్‌ దొరికింది. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన అభిమానులకు థాంక్స్‌.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs